కాంగ్రెస్ 'ఓటు చోరీ' ఆరోపణలను తిప్పికొట్టండి: బీజేపీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపు
- ఎన్నికల కమిషన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్న రాంచందర్ రావు
- వరుస ఓటములతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శ
- రాజ్యాంగబద్ద సంస్థలపై బుదర చల్లుతున్నారని మండిపాటు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న 'ఓటు చోరీ' ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ (ఈసీ) పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, మీడియా ప్యానలిస్టులతో జరిగిన సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. దొంగ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగబద్ధ సంస్థలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ చేపట్టిన 'ఓటు చోరీ' ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజాస్వామ్యంలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా నుంచి తమ మద్దతుదారుల పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాంచందర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, జాతీయ స్థాయిలో రాష్ట్రపతిని కూడా కలిసి తమ వాదనలు వినిపించారు.