మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ అరెస్ట్‌
Add ap7am to your home Screen

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ అరెస్ట్‌

Mahatma Gandhi great grandson Tushar Gandhi arrested
  • ఢిల్లీలోని సీజేపీ చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన తుషార్‌ గాధీ
  • ముంబైలోని క్రాంతి మైదాన్‌లో నిరసనలకు పిలుపునిచ్చిన తుషార్‌
  • నిరసనకు అనుమతి లేదని పోలీసుల ప్రకటన
  • ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసుల ప్రకటన
మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జన్‌తా పార్టీ (సీజేపీ) చేపట్టనున్న నిరసనకు మద్దతుగా ముంబైలోని ‘క్రాంతి మైదాన్‌’కు వెళ్తుండగా ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

‘హమ్‌ భారత్‌ కే లోగ్‌’ అధ్యక్షుడిగా ఉన్న తుషార్‌ గాంధీ.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు క్రాంతి మైదాన్‌లో నిరసన చేపట్టాలని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి గామ్‌దేవి పోలీస్‌ స్టేషన్‌కు ఎలాంటి దరఖాస్తు అందలేదని, అనుమతి కూడా ఇవ్వలేదని జోనల్‌ డీసీపీ రాగసుధ ఆర్‌ తెలిపారు.

క్రాంతి మైదాన్‌ నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, అక్కడ ఆందోళనలు నిర్వహించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తుషార్‌ గాంధీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోనూ ఆయన వేదికపై కనిపించారు.

మరోవైపు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ, ‘ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌’ (ఐసా) చేపట్టనున్న నిరసన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ సంస్థలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.

నిరసనల నేపథ్యంలో దేశ రాజధానిలో 20 వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. శుక్రవారం రాత్రి నుంచి ఢిల్లీ మెట్రోలోని 45 స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. ఢిల్లీలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. నిరసనకు ఇంకా అనుమతి రాకపోవడంతో నగరవ్యాప్తంగా నిఘా పెంచారు.
Advertisement
Tushar Gandhi
Mumbai Police
Kranti Maidan
Cockroach Janata Party
Gyanesh Kumar
Jantar Mantar Protest

More Telugu News