ఢిల్లీని పాకిస్థాన్‌కు అప్పగించారా?: కేంద్రంపై నారాయణ తీవ్ర ఆగ్రహం
Add ap7am to your home Screen

ఢిల్లీని పాకిస్థాన్‌కు అప్పగించారా?: కేంద్రంపై నారాయణ తీవ్ర ఆగ్రహం

CPI Narayana Slams Central Government Over Delhi Lockdown and Massive Police Deployment
  • ఢిల్లీలో నిర్బంధంపై కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ ఫైర్
  • తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపుపై హర్షం
  • కమ్యూనిస్టులను ఓడించాలన్న కాంగ్రెస్‌పై విమర్శలు
సీపీఐ సీనియర్ నేత నారాయణ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారని, ఇంతకీ ఢిల్లీని పాకిస్థాన్‌కు ఏమైనా అప్పగించారా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అణచివేసేందుకు 50 వేల నుంచి 75 వేల మంది పోలీసు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించి సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేయడం అన్యాయమని అన్నారు. కేంద్రం తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం కేంద్రం పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు కూడా స్పందిస్తున్నాయని గుర్తుచేశారు.

ఇదే సమయంలో, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించడంపై నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఎన్నికలను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా రాజకీయ పోటీగా మార్చిన కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. అధికార అహంకారంతో కమ్యూనిస్టులను ఓడించాలని పిలుపునివ్వడం సరికాదన్నారు. ప్రజల ఉద్యమాలను అణచివేతతో ఆపలేరని, కేంద్రం తన తప్పులను సరిదిద్దుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
Advertisement
CPI Narayana
Delhi Protests
Central Government
Delhi Lockdown
Telangana RTC Elections
AITUC Victory

More Telugu News