సీఈసీ వివాదం: ప్రతిపక్షాల తీరుపై వెంకయ్యనాయుడు అసంతృప్తి
- 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు అవాస్తవమన్న వెంకయ్యనాయుడు
- ఓడిపోతే ఈవీఎంలను నిందించడం హాస్యాస్పదమని వ్యాఖ్య
- ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని విమర్శ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. విపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన హితవు పలికారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ వస్తున్న ఆరోపణలు కేవలం అపోహ మాత్రమేనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు. "రాజీనామా కోరడం తప్పు కాదు, కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు" అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓటమి పాలైతే ఈవీఎంలను నిందించడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని, దానిని వీధుల్లోకి లాగడం దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు. ఎన్నికల సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉన్నామని చెబుతున్నా, ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో అర్థం కావడం లేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.