భువీ రీఎంట్రీ అందుకేనా?.. షమీ, సిరాజ్‌లను ఎందుకు ఆడించడం లేదు?: వసీం జాఫర్
- న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ ఎంపిక
- ఆలస్యమైనా సరైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ జాఫర్
- అనుభవాన్ని పక్కన పెట్టొద్దని, వయసు చూడొద్దని సూచన
- షమీ, సిరాజ్‌లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై జాఫర్ అసంతృప్తి
- ప్రపంచ కప్ తర్వాతే ప్రయోగాలు చేయాలని సెలెక్టర్లకు హితవు
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, ఈ ఎంపిక వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది.
ఆఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత బౌలింగ్ లైనప్‌పై సెలెక్టర్లకు పూర్తి విశ్వాసం లేదని, అందుకే అనుభవజ్ఞుడైన భువీని తిరిగి జట్టులోకి తీసుకువచ్చారని సమాచారం. ఈ సిరీస్‌లో భువనేశ్వర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే, ప్రపంచ కప్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి కీలక భాగస్వామి అయ్యే అవకాశాలున్నాయి.
భువనేశ్వర్ ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు వాసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. అతడు ఈ అవకాశానికి అర్హుడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఫిట్‌నెస్‌తో కూడా ఉన్నాడు. ఇంతకుముందు అతడిని ఎందుకు పక్కనపెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు" అని తన యూట్యూబ్ ఛానెల్‌లో జాఫర్ పేర్కొన్నాడు.
వయసును కారణంగా చూపి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను నిర్లక్ష్యం చేయొద్దని జాఫర్ హితవు పలికాడు. "వయసును పక్కనపెట్టి ప్రదర్శనను చూడాలి. ఒత్తిడి సమయంలో అనుభవం చాలా అవసరం. కేవలం యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగలేం. జట్టులో యువత, అనుభవం రెండూ సమపాళ్లలో ఉండాలి" అని జాఫర్ వివరించాడు.
ఇదే సమయంలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లకు నిలకడగా అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "షమీని టెస్టు జట్టులోకి తీసుకోవాలి. ఇక వన్డేల విషయానికొస్తే గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ, నితీశ్ రెడ్డి వంటి ఎందరో కొత్త ఆటగాళ్లను ప్రయత్నించారు. కానీ, మేనేజ్‌మెంట్‌కు వారిపై ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు. నా దృష్టిలో బుమ్రా, షమీ, సిరాజ్ ప్రస్తుతానికి ఉత్తమ పేస్ త్రయం. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే జట్టు పునర్నిర్మాణం గురించి ఆలోచించాలి. ఇప్పుడు షమీని నిర్లక్ష్యం చేస్తే, బహుశా అతడి కెరీర్‌కు తలుపులు మూసుకుపోయినట్లే" అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.