2027 వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ రిటైర్ అవ్వడా? ఇంగ్లండ్ మాజీ స్టార్ సంచలన కామెంట్స్

2027 వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ రిటైర్ అవ్వడా? ఇంగ్లండ్ మాజీ స్టార్ సంచలన కామెంట్స్

Virat Kohli may not retire after 2027 World Cup says former England star
  • 2027 వన్డే వరల్డ్‌కప్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన కోహ్లీ
  • అయితే ఆ టోర్నీ తర్వాత కూడా కోహ్లీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకపోవచ్చన్న పనేసర్
  • విరాట్‌లో ఇప్పటికీ పరుగులు చేయాలనే ఆకలి చాలా ఉందని వ్యాఖ్య
  • అందుకే వరల్డ్‌కప్ తర్వాత అతడు రిటైర్ అవుతాడని తనకు అనిపించడం లేదన్న పనేసర్‌
  • రోహిత్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలడని ప్రశంస
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ తనకు చివరిదని కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ తర్వాత కూడా కోహ్లీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకపోవచ్చని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవల వన్డేల్లో కోహ్లీ 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఆటపై పనేసర్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో ఆటపై ఆకలి, దూకుడు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తనను ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు. కోహ్లీ శిక్షణ చూస్తే తాను కూడా జిమ్‌కు వెళ్లాలనిపిస్తుందని పేర్కొన్నాడు.

‘‘విరాట్‌లో ఇప్పటికీ పరుగులు చేయాలనే ఆకలి చాలా ఉంది. ప్రతి మ్యాచ్‌ను ఎంతో తీవ్రతతో ఆడతాడు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తాడు. 10-15 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయని భావిస్తే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూస్తాం. కోహ్లీ కూడా ప్రస్తుతం అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాడు. ప్రతి బంతికి తన వంద శాతం ఇస్తున్నాడు. అందుకే వరల్డ్‌కప్ తర్వాత అతడు రిటైర్ అవుతాడని నాకు అనిపించడం లేదు. అతడి నుంచి ఇంకా చాలా క్రికెట్ చూడొచ్చు’’ అని పనేసర్ చెప్పాడు.

మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనా పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ గొప్ప ఆటగాడని, అతడికి ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వాలని అన్నాడు. రోహిత్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు.

‘‘రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అతడు ఫామ్‌లోకి వస్తే బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేయగలడు. భారత్‌కు అతడి లాంటి నాణ్యమైన ఆటగాడు అవసరం’’ అని పనేసర్ చెప్పాడు.
Advertisement
Virat Kohli
Monty Panesar
Rohit Sharma
2027 ODI World Cup
Indian Cricket Team
Cricket Retirement News

More Telugu News