కుమార్తె పెళ్లికి తమిళనాడు సీఎం విజయ్‌ను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
- తమిళనాడు సీఎం విజయ్‌తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ
- భర్త అనిల్ కుమార్‌తో కలిసి సీఎంను కలిసిన షర్మిల
- కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి విజయ్‌ను ఆహ్వానించిన దంపతులు
- వివాహ పత్రిక అందించి వేడుకకు రావాల్సిందిగా విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహ వేడుకకు ఆయన్ను ఆహ్వానించేందుకు షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి నేడు చెన్నై వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం విజయ్‌ను నేరుగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
వచ్చే నెల 25న తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం జరగనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం విజయ్‌ను సాదరంగా కోరారు. ఈ సమావేశం అనంతరం షర్మిల సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
తమకు సమయం కేటాయించిన సీఎం విజయ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆయన చూపిన ఆప్యాయత, అనురాగం ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులకు సీఎం విజయ్ తన శుభాకాంక్షలు తెలియజేసినట్లు వైఎస్ షర్మిల వివరించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.