మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

Pradhama Drushtya Kuttakkar Movie Update
  • మలయాళం నుంచి మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 
  • ప్రధానమైన పాత్రలో పార్వతీ తిరువోతు 
  • క్రితం నెలలో విడుదలైన సినిమా
  • ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి      

మలయాళంలో సూపర్ హిట్ అనిపించుకున్న ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'ప్రథమ ద్రుష్ట్యా కుట్టక్కర్'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. పార్వతీ తిరువోతు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, షహద్ నిలంబూర్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో భారీస్థాయిలో విడుదలైంది. గట్టిపోటీని తట్టుకుని నిలబడి హిట్ టాక్ తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. పార్వతీ తిరువోతుతో పాటు మాథ్యూ  థామస్ .. విజయ రాఘవన్ .. సిద్ధార్థ్ భరత్ కనిపించనున్నారు. ముజీబ్ మజీద్ అందించిన నేపథ్య సంగీతం కనెక్ట్ అవుతుందని అంటున్నారు. 

ఈ సినిమాలో 'అలీనా అబ్రహం' అనే కానిస్టేబుల్ పాత్రలో పార్వతీ తిరువోతు కనిపించనుంది. ఈ కథ పోలీస్ స్టేషన్ లో పోలీసుల చుట్టూ తిరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసుల కారణంగా ఒక నేరం జరుగుతుంది. ఆ నేరం తమ వలన జరిగిందనే విషయం బయటపడనీయకుండా పోలీసులు ఆధారాలు దొరక్కుండా చేయాలనుకుంటారు. వాళ్ల ప్లాన్ ఫలిస్తుందా? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి,. 


Advertisement
Parvathy Thiruvothu
Pradhama Drushtya Kuttakkar
Netflix OTT Release
Malayalam Investigative Thriller
Shahad Nilambur
Mathew Thomas

More Telugu News