భువీ రీఎంట్రీ వెనుక అసలు కథ ఇదే.. అగార్కర్‌ వెళ్లాకే ఛాన్స్!

భువీ రీఎంట్రీ వెనుక అసలు కథ ఇదే.. అగార్కర్‌ వెళ్లాకే ఛాన్స్!

Bhuvneshwar Kumar comeback story the real reason behind his return
  • నాలుగేళ్ల తర్వాత భువీకి టీమిండియాలో చోటు
  • న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు భువీ ఎంపిక
  • ఇప్పటి వరకు అతణ్ని దూరం పెట్టడానికి అగార్కర్‌ వైఖరే కారణమని సమాచారం
  • అతడు తప్పుకొన్న తర్వాత భువీ ఎంపిక కోసం సెలెక్టర్లను ఒప్పించడం ఈజీ అయినట్లు సమాచారం
  • మయాంక్‌, ప్రిన్స్‌కు భువీ మార్గదర్శకం అవుతాడని భావన
దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగొచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అయితే ఇప్పటి వరకు అతడిని దూరం పెట్టడం వెనక మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వైఖరి కీలకంగా మారినట్లు సమాచారం.

గత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంలో భువీ కీలక పాత్ర పోషించాడు. 17 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో స్వింగ్‌, సీమ్‌తో స్టార్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయినా అగార్కర్‌ హయాంలోని జాతీయ జట్టు సెలెక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు.

భువీ ఎంపిక కోసం సెంట్రల్‌ జోన్‌ సెలెక్టర్‌ రుద్ర ప్రతాప్‌ సింగ్‌ ప్రయత్నించినా పెద్దగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. అగార్కర్‌ తప్పుకొన్న తర్వాత పరిస్థితి మారింది. తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాతో పాటు ఇతర సెలెక్టర్లను భువీ అనుభవం గురించి చెప్పి ఒప్పించడం సులువైందని సమాచారం.

భువనేశ్వర్‌ను అగార్కర్‌ లెక్కలోకి తీసుకోకపోవడానికి ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలేమీ లేవని విశ్లేషకులు అంటున్నారు. అగార్కర్‌ సెలెక్షన్ విధానం పూర్తిగా భవిష్యత్తు జట్టును నిర్మించే దిశగా సాగిందని వివరించారు. ఈ క్రమంలోనే సీనియర్‌ ఆటగాళ్ల విషయంలో ఆయన నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందనేనది విశ్లేషణ.

జస్‌ప్రీత్‌ బుమ్రా అందుబాటులో లేని సమయంలో భువీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావించారు. యువ పేసర్లు మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌కు అతడి అనుభవం మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. వీరిద్దరినీ 2028 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ ఆశిస్తున్న ఆటగాళ్లుగా చూస్తున్నారు.

భువీ ఇప్పటివరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడాడు. టీ20ల్లో 90 వికెట్లు తీసుకున్నాడు. అతడి రీఎంట్రీతో మహ్మద్‌ షమీకీ జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశలు పెరిగే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో తొలి టీ20 అక్టోబర్‌ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. రెండో మ్యాచ్‌ అక్టోబర్‌ 24న అక్కడే ఉంటుంది. అక్టోబర్‌ 27న వెల్లింగ్టన్‌లో మూడో టీ20, అక్టోబర్‌ 30న ఆక్లాండ్‌లో నాలుగో మ్యాచ్‌ జరగనున్నాయి. నవంబర్‌ 1న హామిల్టన్‌లో చివరి టీ20తో సిరీస్‌ ముగుస్తుంది.

Advertisement
Bhuvneshwar Kumar
India vs New Zealand T20 series
Ajit Agarkar
Pragyan Ojha
Team India T20 squad
Indian cricket team selection

More Telugu News