రాజకీయాల్లోకి నటుడు ధనుష్.. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త పార్టీ?
- నటుడు ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం
- ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసినట్లు కథనాలు
- విజయ్ విజయం తర్వాత తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం
తమిళనాడు రాజకీయాలు మరోసారి సినీ గ్లామర్‌తో వేడెక్కుతున్నాయి. సూపర్‌స్టార్ విజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు మరో ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రారంభించనున్నారని చెన్నై వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళ మీడియా కథనాల ప్రకారం.. ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ధనుష్ తన అభిమాన సంఘాలను బలోపేతం చేయడం, వాటిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించడం వంటి చర్యలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఆయన ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేక జెండాను కూడా ఆవిష్కరించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అద్భుత విజయం సాధించి, దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ప్రతిపక్షానికి పరిమితం చేసింది. ఈ అనూహ్య రాజకీయ మార్పుల నేపథ్యంలో ధనుష్ కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అయితే, పార్టీ పేరు రిజిస్ట్రేషన్, రాజకీయ ప్రవేశంపై ధనుష్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలన్నీ మీడియా వర్గాల సమాచారం ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే ధనుష్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.