హెచ్-1బి వీసాలపై భారతీయులకు భారీ ఊరట... లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్
- ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తూ రెండో ఫెడరల్ కోర్టు తీర్పు
- ఈ నిర్ణయంతో భారతీయ నిపుణులకు పెద్ద ఊరట
- సరైన విధానాలు పాటించలేదని కోర్టు స్పష్టీకరణ
- ట్రంప్ సర్కార్ విధానానికి ఇది రెండో న్యాయపరమైన ఎదురుదెబ్బ
అమెరికాలో హెచ్-1బి వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజు విధానానికి మరోసారి చుక్కెదురైంది. ఈ వివాదాస్పద ఫీజు వసూలును తక్షణమే నిలిపివేయాలని రెండో ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో, హెచ్-1బి వీసాలపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ నిపుణులకు భారీ ఊరట లభించినట్లయింది.
నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి హేవూడ్ ఎస్.గిలియమ్ జూనియర్ ఈ కీలక తీర్పును వెలువరించారు. ఈ ఫీజును అమలు చేసే క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ కింద పాటించాల్సిన నియమ నిబంధనలను విస్మరించాయని కోర్టు స్పష్టం చేసింది. ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యాసంస్థలు, తయారీ కంపెనీలు, కార్మిక సంఘాలు కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
సెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు, దానిని గత నెలలో పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. హెచ్-1బి వీసాల్లో 71 శాతంతో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నందున, ఈ ఫీజు విధానం వారిపై తీవ్ర ప్రభావం చూపింది. "ఈ లక్ష డాలర్ల ఫీజు వల్ల భారతీయ పౌరులు తీవ్రంగా నష్టపోయారు. ఇది ఉపాధి అవకాశాలను, కుటుంబాల భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది" అని ఈ కేసులో భాగస్వామి అయిన సౌత్ ఏషియన్ అమెరికన్ జస్టిస్ కొలాబరేటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్పనా వి.పెద్దిభొట్ల అన్నారు.
అమెరికన్ ఉద్యోగులను రక్షించడానికే ఈ ఆంక్షలు విధించామని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, కోర్టులు మాత్రం ప్రభుత్వ వాదనతో ఏకీభవించడం లేదు. కాగా, ఈ ఫీజును నిలిపివేయడం ఇది రెండోసారి. గత జూన్‌లో కూడా మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం దానిపై అప్పీల్ చేసినప్పటికీ, ఆ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. తాజా తీర్పుతో ట్రంప్ సర్కార్ విధానానికి మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది.