ఓటర్ల జాబితా సవరణ: నోటీసులు వచ్చినా ఆఫీసులకు రావొద్దు: ఏపీ సీఈవో
- ఓటర్లు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్న సీఈవో
- ఇంటి వద్దకే వచ్చి పత్రాలు సేకరించనున్న బీఎల్‌వోలు
- నిరాశ్రయులు, కార్మికుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు
- జాబితాలో పేరు లేనివారు తర్వాత కూడా నమోదు చేసుకోవచ్చన్న వివేక్ యాదవ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా నోటీసులు అందుకున్నవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌వో) కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) స్వయంగా ఓటర్ల ఇళ్లకు వచ్చి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఆయన తెలిపారు.
గురువారం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో డిల్లీరావు కూడా పాల్గొన్నారు. ఓటర్ల నుంచి పత్రాలు తీసుకున్న తర్వాత బీఎల్‌వోలే వాటిని ఈసీఐ నెట్‌లో అప్‌లోడ్ చేస్తారని వివేక్ యాదవ్ వివరించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో విచారణ ఉంటుందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అలాంటి కేసులు కేవలం 209 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఒకవేళ విచారణకు హాజరుకావాల్సి వస్తే, నోటీసులు అందుకున్న ఓటరు తన తరఫున 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుడిని పంపవచ్చని సూచించారు. ఆన్‌లైన్ విచారణ సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. నగరాల్లోని నైట్‌షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల ఓటు నమోదు కోసం అవసరాన్ని బట్టి ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో సూచించారు.
‘సర్’ ప్రక్రియ కోసం ఫాం-6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. అయితే సాధారణ సమయాల్లో మాత్రం 'రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్-1960' ప్రకారమే ఫాం-6లను వినియోగించాలని స్పష్టం చేశారు. ‘సర్’ ప్రక్రియలో లేదా తర్వాత జాబితాలో పేర్లు నమోదు చేసుకోలేకపోయిన యువత, మొదటిసారి ఓటు వేసేవారు 'కంటిన్యూయస్ అప్‌డేషన్' ప్రక్రియలో ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.