రాయలసీమ దశ మార్చే ప్రణాళిక.. లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్’.. నేడే ప్రారంభం
- రాయలసీమను ప్రపంచ ఉద్యాన హబ్‌గా మార్చనున్న ‘రాయలసీమ రైజింగ్’
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు
- రాబోయే మూడేళ్లలో 10 జిల్లాల్లో ఉద్యాన పంటల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన
- రిలయన్స్ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
రాయలసీమ రూపురేఖలను మార్చే బృహత్తర ప్రణాళికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా (గ్లోబల్ హార్టికల్చర్ హబ్) తీర్చిదిద్దే లక్ష్యంతో ‘రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్టును నేటి (శుక్రవారం) ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభించనుంది. అన్నమయ్య జిల్లా బీకేపల్లి వద్ద జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ ప్రాజెక్టు కింద మొత్తం రూ. లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో పూర్వోదయ పథకం కింద ప్రభుత్వ వాటాగా రూ.40,352 కోట్లు ఖర్చు చేయనుండగా, ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60,000 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రణాళికను 2026 నుంచి 2029 మధ్య మూడు దశల్లో మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను ‘ప్రపంచ ఫలభాండాగారం’ (ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్)గా మార్చాలన్నది ప్రభుత్వ ధ్యేయం.
ఈ ప్రణాళికలో భాగంగా పలు కీలక లక్ష్యాలను నిర్దేశించారు. 2029 నాటికి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 6 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచనున్నారు. దీని ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.4,562 కోట్లతో 5,721 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, రూ.20,884 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీనివల్ల 9 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు, 4.3 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఉద్యానవన రంగానికి ప్రత్యేకంగా రూ.14,906 కోట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ రంగంలో వ్యవస్థాపకత, ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ కేంద్రంగా ఈ సంస్థ పనిచేయనుంది.