కాంగ్రెస్ గూటికి మమత?: అధీర్ వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
- ‘భారాన్ని’ వదిలేసి కాంగ్రెస్‌లో చేరాలన్న అధీర్ రంజన్
- తృణమూల్ కాంగ్రెస్‌ను విలీనం చేయాలని బహిరంగ పిలుపు
- ఇండియా కూటమి సమావేశం తర్వాత ఆసక్తికర పరిణామం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. అయితే, పార్టీలో చేరే ముందు ఆమె తనకున్న ‘భారాన్ని’ వదిలించుకోవాలని షరతు పెట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గురువారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన అధీర్ రంజన్ చౌదరి.. మమతకు ఈ ఆఫర్ ఇచ్చారు. "మమతా బెనర్జీ ఇప్పటికీ ఆమెకు విధేయులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా కాంగ్రెస్‌లో చేరితే అది సరైన నిర్ణయం అవుతుంది. దాన్ని మేము స్వాగతిస్తాము. కాంగ్రెస్ అనే మర్రిచెట్టు కింద ఇప్పటికే ఆశ్రయం పొందుతున్న ఆమె ప్రత్యేక పార్టీని నడపడం కంటే నేరుగా కాంగ్రెస్‌లో చేరాలి. అయితే, ఆమె తనకున్న 'భారాన్ని', ముఖ్యంగా ఆమెకు అతిపెద్ద సమస్యగా మారిన 'ఒకరిని' వదిలేసి రావాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
అధీర్ రంజన్ చౌదరి 'భారం' అని ఎవరిని ఉద్దేశించారో స్పష్టంగా చెప్పనప్పటికీ, అది మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఉద్దేశించేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామం రెండు కారణాల వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. మొదటిది, ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మమతా బెనర్జీ 1998లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. రెండవది, అధీర్ రంజన్ చౌదరి తన రాజకీయ జీవితమంతా మమతా బెనర్జీకి గట్టి రాజకీయ ప్రత్యర్థిగా, తీవ్ర విమర్శకుడిగా పేరుపొందారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ పిలుపు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బుధవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్, మమత పలు అంశాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకున్నారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజే అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.