ప్రియుడితో లాడ్జిలో మహిళ... సుపారీ ఇచ్చి అపహరించి, అత్యాచారం చేయించిన భార్య!

ప్రియుడితో లాడ్జిలో మహిళ... సుపారీ ఇచ్చి అపహరించి, అత్యాచారం చేయించిన భార్య!

Woman with boyfriend in lodge kidnapped and gang raped by wife who gave supari
  • ప్రియుడితో లాడ్జిలో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం
  • ఘటన వెనుక ప్రియుడి భార్య... సుపారీ ఇచ్చినట్లు అనుమానం
  • ప్రియుడి కాళ్లు, చేతులు విరిచి ఆసుపత్రి వద్ద వదిలేసిన దుండగులు
  • ప్రధాన నిందితురాలైన భార్య సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కేరళలోని త్రిశ్శూర్‌లో సంచలనం సృష్టించిన అపహరణ, సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో బాధితురాలి ప్రియుడి భార్య కూడా ఉండటం గమనార్హం. ప్రియుడితో కలిసి లాడ్జిలో బస చేసిన ఓ మహిళపై ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం, మలప్పురం జిల్లా నిలంబూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ, వివాహితుడైన తన ప్రియుడు, తమిళనాడు తిరుప్పూర్ వాసి గుణశేఖరన్‌తో కలిసి త్రిశ్శూర్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో గది తీసుకుంది. ఈ విషయం గుణశేఖరన్ భార్య దేవి (27)కి తెలిసింది. భర్త మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి వారు ఉన్న లాడ్జ్‌ను గుర్తించింది. అనంతరం ఓ ముఠాకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సెప్టెంబర్ 22న పోలీసుల వేషంలో దేవి, మరో నలుగురు వ్యక్తులు లాడ్జ్‌ గదిలోకి చొరబడ్డారు. బాధితురాలిని, గుణశేఖరన్‌ను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కారులో అపహరించుకుపోయారు. మార్గమధ్యంలో గుణశేఖరన్ కాళ్లు, చేతులు విరిచి తిరుప్పూర్‌లోని ఒక ఆసుపత్రి బయట వదిలేశారు. ఆ తర్వాత బాధితురాలిని మరో కారులోకి మార్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు వారి నుంచి తప్పించుకుని నిలంబూర్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. త్రిశ్శూర్ సిటీ పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిందితులైన దేవి, థామస్ ప్రియదర్శన్ దేవ (27), రఘుపతి రాజా (20), శంకర్ (20), పాల్‌రాజ్ (31)లను నెడుంబస్సేరి, తిరుప్పూర్, కోయంబత్తూర్, పళని ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఈ దాడిని 'క్వటేషన్' (సుపారీ) కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో మైనర్ కోసం గాలింపు కొనసాగుతోంది.
Advertisement
Devi
Thrissur gang rape case
Kerala kidnapping crime
Supari attack Kerala
Gunasekaran kidnapping
Kerala police arrest

More Telugu News