ఆసియా క్రీడలు: ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి.. ఆర్చరీలో చారిత్రక స్వర్ణం గెలిచిన భారత మహిళలు
Advertisement

ఆసియా క్రీడలు: ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి.. ఆర్చరీలో చారిత్రక స్వర్ణం గెలిచిన భారత మహిళలు

Indian Women Archery Team wins historic gold by defeating Olympic champions in Asian Games
  • రికర్వ్ ఆర్చరీలో మహిళల జట్టుకు గోల్డ్
  • ఫైనల్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాపై గెలుపు
  • అంకిత, కీర్తి, కుంకుమ్‌తో కూడిన జట్టు అద్భుత ప్రదర్శన
  • ఈ విజయంతో భారత్ స్వర్ణాల సంఖ్య 11కి చేరింది
  • పతకాల పట్టికలో భారత్ 7వ స్థానంలో కొనసాగుతోంది
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. సీనియర్ ఆర్చర్ అంకిత భకత్‌తో పాటు యువ క్రీడాకారిణులు కీర్తి, కుంకుమ్ మొహొద్‌లతో కూడిన భారత జట్టు, ఫైనల్‌లో శక్తిమంతమైన దక్షిణ కొరియా జట్టును ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

ఈ విజయం ఎంత గొప్పదంటే.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన జట్టు దక్షిణ కొరియా కావడం విశేషం. అలాంటి బలమైన జట్టును ఓడించి భారత మహిళలు బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు 5-1 తేడాతో చైనాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 11కి చేరింది.

ఇదిలా ఉంటే.. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్, పర్వీన్, అంకుశ్ తమ విభాగాల్లో స్వర్ణ పతకాల కోసం ఫైనల్స్‌లో తలపడనున్నారు. సాయంత్రం జరిగే మహిళల హాకీ ఫైనల్‌లో భారత్, చైనాతో స్వర్ణం కోసం పోరాడనుంది. రెజ్లింగ్‌లో కూడా మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం భారత్ ఖాతాలో మొత్తం 67 పతకాలు ఉన్నాయి. వీటిలో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతోంది.
Advertisement
Ankita Bhakat
Indian Womens Archery Team
Asian Games 2026
India vs South Korea Archery
Asian Games Gold Medal
India Medal Tally

More Telugu News