ఆర్చ‌రీలో చ‌రిత్ర సృష్టించిన భార‌త ప్లేయ‌ర్లు.. మ‌రో గోల్డ్ కైవ‌సం
Advertisement

ఆర్చ‌రీలో చ‌రిత్ర సృష్టించిన భార‌త ప్లేయ‌ర్లు.. మ‌రో గోల్డ్ కైవ‌సం

Indian Archery Team creates history by winning another gold medal
  • కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌కు స్వర్ణం.. ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
  • గోల్డ్ గెలిచిన సాహిబ్ జాద‌వ్‌, చికితా తానివ‌ర్తి జోడీ 
  • మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు కూడా స్వర్ణ పతకం
  • స్క్వాష్ మహిళల జట్టు సెమీస్‌కు.. మరో పతకం ఖాయం
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్చరీలో నేడు భారత్‌కు స్వర్ణాల పంట పండింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్‌లో చైనాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది. 

అదే జోరులో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సాహిబ్ జాద‌వ్‌, చికితా తానివ‌ర్తి జోడీ స్వ‌ర్ణం గెలిచింది. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించి భారత్‌కు రెట్టింపు ఆనందాన్ని అందించింది.

ఇతర క్రీడల్లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. మహిళల స్క్వాష్‌లో తన్వి ఖన్నా, అనహత్ సింగ్‌లతో కూడిన జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకాన్ని ఖాయం చేసింది. అథ్లెటిక్స్ ఈవెంట్లు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి రెజ్లర్లు, బాక్సర్లు, ఆర్చర్లపైనే ఉంది.

హాకీలో భారత మహిళల జట్టు ఫైనల్‌లో స్థానం కోసం దక్షిణ కొరియాతో తలపడనుంది. స్టార్ జూడోకా అస్మితా దేయ్ కూడా బరిలోకి దిగనుంది. నిన్న మహిళల ట్రాప్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన నీరూ ధండా, నేడు మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్, టీమ్ ఈవెంట్‌లో పోటీపడనుంది.
Advertisement
Indian Archery Team
Asian Games 2026
Sahib Jadhav
Chikitha Tanivarthi
Women Compound Archery Gold
LA 2028 Olympics qualification

More Telugu News