కాన్పూర్ ఫార్మా డీలర్ హత్య కేసులో భారీ ట్విస్ట్: సూత్రధారి కోడలు కాదు.. కన్న కొడుకే!
- కాన్పూర్ ఫార్మా డీలర్ వినీత్ మనోచా హత్య కేసులో కుమారుడే ప్రధాన సూత్రధారి
- తండ్రిని చంపేందుకు రూ. 6 లక్షలకు కిరాయి హంతకులను మాట్లాడిన సుబ్రత్
- పట్టుబడితే తన భార్య పేరు చెప్పమని హంతకులకు సూచించినట్లు వెల్లడి
- ఆస్తి వివాదాలు, భారీ అప్పులే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల నిర్ధారణ
- జ్యుడీషియల్ కస్టడీకి నిందితుడు సుబ్రత్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన ఫార్మాస్యూటికల్ డీలర్ వినీత్ మనోచా (63) హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ దారుణానికి కోడలు కారణమని భావిస్తున్న తరుణంలో, అసలు సూత్రధారి కన్న కొడుకు సుబ్రత్ మనోచానే (32) అని పోలీసులు తేల్చారు. తండ్రిని హత్య చేయించడమే కాకుండా, ఆ నేరాన్ని తన భార్య షాలు మనోచాపై నెట్టేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మూడు నాలుగు నెలల క్రితమే సుబ్రత్ తన తండ్రి హత్యకు పథకం పన్నాడు. గతంలో తన తండ్రి వద్ద పనిచేసిన విశాల్ గౌతమ్‌ను కలిసి, రూ. 6 లక్షలకు సుపారీ ఇచ్చాడు. పట్టుబడితే తన భార్య షాలు పేరు చెప్పాలని విశాల్‌కు సూచించాడు. హత్య రోజున ఇంటి తాళాలను కూడా హంతకులకు సుబ్రతే అందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హత్యకు గల కారణాలను సుబ్రత్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. తన తండ్రికి పలువురు మహిళలతో సంబంధాలు ఉండేవని, ఆయన ఆస్తిని వేరే వారికి రాసిస్తాడేమోనన్న భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. దీనికి తోడు ఐపీఎల్ బెట్టింగ్, జూదం వల్ల తనకు రూ. 40-50 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయని, ఆర్థిక ఇబ్బందులు కూడా హత్యకు ఒక కారణమని తెలిపాడు. తండ్రి ఇచ్చే నెలసరి డబ్బులు తన ఈఎంఐలకు కూడా సరిపోవడం లేదని, ప్రతి విషయంలో తనను నియంత్రించేవారని వాపోయాడు.
ఈ నెల 5న కల్యాణ్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో వినీత్ మనోచా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన గొంతు కోసి, 26 సార్లు కత్తితో పొడిచి చంపారు. తొలుత ఈ కేసులో పోలీసులు విశాల్ గౌతమ్, రాజ్ కిషోర్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు. వారి విచారణలో కోడలు షాలు మనోచా పేరు చెప్పడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే, సుబ్రత్ కిరాయి హంతకుడు విశాల్ మధ్య 250కి పైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు సీడీఆర్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి సుబ్రత్‌ను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం సుబ్రత్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో షాలుకు ఇంకా క్లీన్ చిట్ ఇవ్వనప్పటికీ, ఆమె విడుదలకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా రికార్డులతో కేసును ఛేదించినట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ ప్రకటించారు.