Advertisement

హెయిర్‌కట్‌ తర్వాత ఈ మసాజ్‌ వద్దు.. నరాలు దెబ్బతినే ప్రమాదం!

Health
Advertisement
  • మెడ క్రాకింగ్‌తో రక్తనాళాలకు గాయమయ్యే ప్రమాదం
  • తీవ్రమైన సందర్భాల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశం
  • నరాలు దెబ్బతింటే పక్షవాతం రావచ్చంటున్న నిపుణులు
  • శ్వాస నరం దెబ్బతినే ప్రమాదం
  • లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మేలు
హెయిర్‌కట్‌ అయిపోయింది.. ఇక మెడ మసాజ్‌! కాసేపు అలా మెడను తిప్పి ‘కట్‌.. కట్‌’ అనే శబ్దం వచ్చేలా చేస్తే ఏదో రిలీఫ్‌ వచ్చినట్లు అనిపిస్తుంది. చాలామంది దీన్ని హెయిర్‌కట్‌లో భాగంగానే భావిస్తారు. కానీ అదే సరదా.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని న్యూరోసర్జన్లు హెచ్చరిస్తున్నారు. మెడను ఒక్కసారిగా బలంగా తిప్పడం వల్ల రక్తనాళాలు, నరాలు, వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావచ్చని చెబుతున్నారు.

సరదాగా మొదలై.. స్ట్రోక్‌కు దారితీయొచ్చు
మన మెడలో మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే వెర్టీబ్రల్‌ ఆర్టరీలు ఉంటాయి. మెడను వేగంగా, బలంగా తిప్పితే ఈ రక్తనాళాల గోడలకు చీలిక వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ రక్తం గడ్డకట్టొచ్చు. ఆ గడ్డ మెదడుకు రక్తప్రసరణను అడ్డుకుంటే స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వెంటనే రావచ్చు. కొన్ని సందర్భాల్లో రోజుల తర్వాత కూడా లక్షణాలు కనిపించొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నరాలు దెబ్బతింటే పరిస్థితి తీవ్రం
మెడలోని వెన్నుపాము, కీలకమైన నరాలు కూడా ప్రమాదంలో పడొచ్చు. ముఖ్యంగా శ్వాసకు ఉపయోగపడే ఫ్రెనిక్‌ నరం దెబ్బతింటే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో డయాఫ్రమ్‌ పనిచేయక వెంటిలేటర్‌ అవసరం పడే పరిస్థితి కూడా రావచ్చు.

మెడలో ఇప్పటికే డిస్క్‌ సమస్యలు, ఎముకల బలహీనత ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కసారిగా మెడ తిప్పడం వల్ల వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి చేతులు, కాళ్లలో మొద్దుబారడం లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

వయసు పెరిగినవారు మరింత జాగ్రత్త
బలంగా మెడ తిప్పడం వల్ల కండరాలు, లిగమెంట్లు కూడా దెబ్బతినొచ్చు. పదేపదే ఇలా చేయడం వల్ల మెడ కీళ్లలో అస్థిరత, నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు రావచ్చు. వృద్ధుల్లో మెడ ఎముకలకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే..
హెయిర్‌కట్‌ తర్వాత మెడను బలంగా తిప్పించుకున్న వెంటనే ముఖం లేదా శరీరంలో ఒకవైపు తిమ్మిరి, బలహీనత, మాట తడబడటం, తల తిరగడం, చూపు మారడం, నడకలో తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లేదా మెడ నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తగ్గుతుందేమో చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా స్ట్రోక్‌ చికిత్స అందుబాటులో ఉన్న ఆసుపత్రిని ఆశ్రయించడం మంచిది.

హెయిర్‌కట్‌ కోసం బార్బర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు.. జుట్టు కత్తిరించమని మాత్రమే చెప్పండి. మెడను బలంగా తిప్పే మసాజ్‌ను మాత్రం వద్దని చెప్పడం సురక్షితం.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

More Telugu News

ఓవర్‌టేక్ చేశాడని యువకుడి వేళ్లు నరికిన మైనర్లు.. 700 కుట్లు వేసిన వైద్యులు

12 Nov, 10:14

రూ.100తో మొదలైన ప్రయోగం.. నేడు రూ.కోటి వ్యాపారం.. ఒడిశా రైతు సక్సెస్‌ స్టోరీ

12 Nov, 10:12

నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న పెట్టుబడుల పండుగకు సిద్ధమైన విశాఖ

12 Nov, 10:09

పంజాబ్‌లో ఆగని పొలాల దహనం.. 5,500 దాటిన పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు

12 Nov, 10:08

సోనియా గాంధీ జీవితంపై సినిమా.. నిర్మాతలుగా కాంగ్రెస్ కార్యకర్తలు: జగ్గారెడ్డి సంచలన ప్రకటన

12 Nov, 10:06

పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. గుంటూరు జిల్లా వాసి అరెస్ట్

12 Nov, 10:04

భారత్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టులోకి కొత్త పేసర్‌

12 Nov, 10:01

ఆస్ట్రేలియా అడవిలో అద్భుతం.. ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో దొరికిన టీనేజర్

12 Nov, 09:59

సునీతా విలియమ్స్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్ పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా సన్మానం

12 Nov, 09:45

ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు? బీసీసీఐ కీలక ప్రకటన!

12 Nov, 09:43

సొంత వ్యాపారం మొదలుపెట్టే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు.. 'ఐడీ ఫ్రెష్' సీఈవో బంపరాఫర్!

12 Nov, 09:40

థర్మల్ ప్లాంట్లలో కొత్త విప్లవం.. బొగ్గుకు బదులు ఇనుప పొడితో విద్యుత్!

12 Nov, 09:38

వైద్య విద్యలో పరిశోధనలకు పెద్దపీట.. ఎన్టీఆర్ వర్సిటీ కీలక నిర్ణయాలు

12 Nov, 09:34

నవంబర్ 14 పనిదినమే.. ఉద్యోగులకు స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం..ఆ కొందరికి మాత్రమే హాలిడే

12 Nov, 09:20

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల స్కెచ్‌.. జవాన్‌ ఎదురుదెబ్బతో పారిపోయిన దుండగులు!

12 Nov, 09:14
..More Telugu News