దసరా ఉత్సవాలకు అసోం ప్రముఖులను ఆహ్వానించిన కేశినేని చిన్ని

దసరా ఉత్సవాలకు అసోం ప్రముఖులను ఆహ్వానించిన కేశినేని చిన్ని

Kesineni Chinni invites Assam dignitaries for Dasara celebrations
  • విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న కేశినేని చిన్ని
  • అసోంలో పర్యటించిన చిన్ని, మంత్రి సత్యకుమార్
  • అసోం ఆరోగ్య మంత్రి, సీఎస్ లకు ఆహ్వానం

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తూ, ఇతర రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వానాలు అందించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలసి కేశినేని చిన్ని అసోం రాష్ట్రంలో పర్యటించారు. 


ఈ సందర్భంగా అసోం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోటలను మర్యాదపూర్వకంగా కలిసి, ఇంద్రకీలాద్రిపై జరిగే విజయవాడ దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ నగర ప్రాశస్త్యం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా రూపుదిద్దుకుంటున్న ‘విజయవాడ ఉత్సవ్’ ప్రత్యేక వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు.


విజయవాడ నగరానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఇంద్రకీలాద్రి వైభవాన్ని, నగర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈసారి ‘విజయవాడ ఉత్సవ్’ను ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు.

Advertisement
Kesineni Sivanath
Vijayawada Dasara
Kanaka Durga Temple
Vijayawada Utsav
Assam Health Minister Ashok Singhal
Satya Kumar Yadav

More Telugu News