చంద్రబాబు 99 పైసలకే తనకు కావాల్సిన వారికి అత్యంత విలువైన భూములు కేటాయిస్తున్నారు: జగన్

చంద్రబాబు 99 పైసలకే తనకు కావాల్సిన వారికి అత్యంత విలువైన భూములు కేటాయిస్తున్నారు: జగన్

YS Jagan Mohan Reddy alleges massive corruption in Andhra Pradesh land allocations
  • విశాఖ వైసీపీ నేతలతో సమావేశమైన జగన్
  • కూటమి ప్రభుత్వంలో అడ్డగోలుగా భూములు పంచుకుంటున్నారని ఆరోపణ
  • ప్రతి గ్రామంలో మంద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని మండిపాటు

వైసీపీ అధినేత జగన్ ఈరోజు విశాఖపట్నానికి చెందిన పార్టీ నేతలతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


రాష్ట్రంలో రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు 99 పైసలకే తనకు కావాల్సిన వారికి అత్యంత విలువైన భూములను కేటాయిస్తున్నారని విమర్శించారు. గీతం యూనివర్సిటీ పేరుతో 55 ఎకరాల భూమిని కేటాయించారంటే ఈ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని, అడ్డగోలుగా భూములను పంచుకుంటున్నారని మండిపడ్డారు.


ప్రతి గ్రామంలో గంజాయితో పాటు విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందని, గుళ్లు, బడుల పక్కన కూడా బెల్టు షాపులు వెలిశాయని మండిపడ్డారు. విశాఖ మేయర్, కార్పొరేషన్‌ను ప్రభుత్వం హైజాక్ చేసిన తీరును ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రతి కార్యకర్తకు అన్ని వేళలా అండగా ఉంటుందని, విశాఖలోని తాగునీటి సమస్యలు, భూముల అక్రమాలపై ప్రజల్లో పోరాడాలని సూచించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదని, 2019 నంద్యాల ఉపఎన్నిక నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. తాత్కాలిక అధికారంతో విర్రవీగినా... శాశ్వతంగా నిలిచేది ప్రజాస్వామ్యమేనని, ప్రజల తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు.

Advertisement
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Visakhapatnam Land Allotment
GITAM University Land Issue
Andhra Pradesh Politics
YSRCP Tadepalli Meeting

More Telugu News