భారత హ్యాకర్ నిసర్గకు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు

భారత హ్యాకర్ నిసర్గకు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు

Nisarga Adhikari gets spot in US Department of Justice Hall of Fame
  • యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు సంపాదించిన నిసర్గ అధికారి
  • అమెరికా చట్ట వ్యవస్థలోని కీలక భద్రతా లోపాన్ని గుర్తించి నివేదించిన 19 ఏళ్ల టీనేజర్
  • యూఎస్ డిఫెన్స్ విభాగం సిస్టమ్‌లోనూ బగ్‌ను గుర్తించిన నిసర్గ
  • గతంలో సీబీఎస్ఈ మార్కుల పోర్టల్‌లో లోపాలను వెలుగులోకి తెచ్చిన పరిశోధకుడు
భారతదేశానికి చెందిన 19 ఏళ్ల సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అమెరికా న్యాయ విభాగం (US Department of Justice - DoJ) తమ ప్రతిష్ఠాత్మక 'హాల్ ఆఫ్ ఫేమ్'లో అతడికి చోటు కల్పించింది. అమెరికాలోని అతిపెద్ద చట్ట అమలు విభాగాల్లో ఒకటైన డీఓజే వ్యవస్థలోని కీలక భద్రతా లోపాన్ని నిసర్గ గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశారు.

ఈ అంశంపై నిసర్గ మాట్లాడుతూ, సుమారు వారం రోజుల క్రితం ఈ లోపాన్ని గుర్తించి డీఓజేకి నివేదించినట్లు తెలిపారు. అతడు అందజేసిన నివేదికను పరిశీలించిన అధికారులు, కేవలం వారం వ్యవధిలోనే ఆ సమస్యను పరిష్కరించారు. బాధ్యతాయుతమైన సైబర్ పరిశోధకుడిగా లోపాన్ని నివేదించినందుకు గుర్తింపుగా తమ అధికారిక అక్‌నాలెడ్జ్‌మెంట్స్ (హాల్ ఆఫ్ ఫేమ్) పేజీలో నిసర్గ పేరును చేర్చారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆ లోపానికి సంబంధించిన వివరాలను అతడు వెల్లడించలేదు. అలాగే, ఈ రిపోర్ట్‌కు తనకు ఎలాంటి నగదు బహుమతి అందలేదని స్పష్టం చేశాడు.

నిసర్గ కేవలం డీఓజే‌లోనే కాకుండా, అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఒక వ్యవస్థలోనూ మరో భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఈ లోపాన్ని అధికారులు సైతం ధ్రువీకరించారని, ప్రస్తుతం దానిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. ఈ సహకారానికి గాను 'హ్యాకర్‌వన్' ప్లాట్‌ఫామ్‌ ద్వారా యూఎస్ డిఫెన్స్ విభాగం నుంచి అతడికి ధన్యవాద సందేశం అందింది.

ఈ ఏడాది ప్రారంభంలో సీబీఎస్ఈ ఆన్‌లైన్ మార్కుల పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను నిసర్గ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడి ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పూర్‌కు చెందిన 'C3iHub', ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) ఇంజనీర్‌గా నియమించింది.
Advertisement
Nisarga Adhikari
US Department of Justice Hall of Fame
Indian Cybersecurity Researcher
DoJ Security Flaw

More Telugu News