విజయవాడ ఘటనతో సంబంధం లేని 250 మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు పెట్టారు: అంబటి రాంబాబు

విజయవాడ ఘటనతో సంబంధం లేని 250 మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు పెట్టారు: అంబటి రాంబాబు

Ambati Rambabu says cases filed against 250 YSRCP leaders unrelated to Vijayawada incident
  • డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టారన్న అంబటి రాంబాబు
  • ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు వ్యవహారమే అని విమర్శ
  • పోలీసులు మఫ్టీలో వచ్చి వైసీపీ నేతలను లాక్కెల్లారని మండిపాటు

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నేతలపై కేసులు పెట్టారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కావాలనే దాడులు చేయించి, రివర్స్ లో అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. విజయవాడ ఘటనతో ఏమాత్రం సంబంధం లేని 250 మందికి పైగా వైసీపీ నాయకులపై భిన్నమైన తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ముమ్మాటికీ కక్షసాధింపు రాజకీయమేనని ఆరోపించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ల దిశానిర్దేశంలోనే ఈ అక్రమ కేసుల పర్వం నడుస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు. ఘటన సమయంలో విజయవాడలోనే లేని వారిపై కూడా కేసులు పెట్టారని, రాత్రికి రాత్రే నోటీసులు కూడా ఇవ్వకుండా మఫ్టీలో వచ్చి వైసీపీ నాయకులను లాక్కెళ్లడం పోలీసుల దుర్మార్గానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అన్యాయంగా ప్రవర్తిస్తున్న నారా లోకేశ్, అందుకు సహకరిస్తున్న అధికారులకు రాబోయే రోజుల్లో చట్టం పదునేంటో చూపిస్తామని, న్యాయస్థానాల ద్వారా చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Ambati Rambabu
YSRCP leaders cases
Vijayawada SAAP protest
Nara Lokesh
Chandrababu Naidu
Andhra Pradesh politics

More Telugu News