తిరుమలలో వైభవంగా సాగిన గరుడ సేవ.. రెండు లక్షల మంది భక్తులతో పోటెత్తిన మాఢవీధులు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైనది గరుడ సేవ
- గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి
- లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిన మాడ వీధులు
- గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమల కొండ
- భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. గరుత్మంతునిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన శ్రీ మలయప్పస్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ లక్షలాది మంది భక్తులకు అభయమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన భక్తుల "గోవిందా.. గోవిందా.." నామస్మరణలతో సప్తగిరులు మార్మోగాయి.
శనివారం సాయంత్రం 6:30 గంటలకు వాహన మండపం నుంచి గరుడ వాహనంపై స్వామివారు బయటకు రాగానే, మాడ వీధుల్లోని గ్యాలరీలలో వేచి ఉన్న భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గజరాజులు ముందు నడుస్తుండగా, భజన బృందాలు, కోలాటాలు, జీయంగార్ల ఘోష్టి, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
భక్తులతో కిక్కిరిసిన మాడ వీధులు
గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మాడ వీధుల్లోని 1.90 లక్షల మంది సామర్థ్యం గల గ్యాలరీలు శుక్రవారం రాత్రికే భక్తులతో కిక్కిరిసిపోయాయి. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ శనివారం ఉదయం నుంచే పాలు, అన్నప్రసాదాలు, తాగునీరు, అల్పాహారం వంటివి నిరంతరాయంగా అందించింది. సుమారు 2000 మంది శ్రీవారి సేవకులు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవలందించారు.
టీటీడీ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వయంగా మాడ వీధుల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జేఈవోలు శరత్, గోపీనాథ్ శిలాతోరణం వద్ద క్యూలైన్లలోని భక్తులకు అందుతున్న అన్నప్రసాదం, నీటి సరఫరాను పరిశీలించారు. సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలిచ్చారు. సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు తిరుమలలోని 8 కీలక ప్రాంతాల్లో సెక్టోరల్ అధికారులుగా విధులు నిర్వర్తించారు.
వైష్ణవ సంప్రదాయంలో గరుడ సేవకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీక అయిన గరుత్మంతునిపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అద్భుతమైన కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర దేవి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.