'వెల్‌కమ్ '2' బేబీ గర్ల్'.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణే
- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి
- ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభవార్తను పంచుకున్న స్టార్ కపుల్
- దీప్‌వీర్‌కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- పెద్ద కూతురు దువాకు చెల్లి వచ్చిందంటూ ప్రముఖుల పోస్టులు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే దంపతులకు రెండో బిడ్డ జన్మించింది. శనివారం దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ దంపతులకు ఇది రెండో సంతానం కాగా, ఇద్దరూ కుమార్తెలే కావడం విశేషం.
ఈ శుభవార్తను రణ్‌వీర్, దీపికా దంపతులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెల్లడించారు. చిన్నారి పాదముద్రల ఫొటోను షేర్ చేస్తూ, 'వెల్‌కమ్ బేబీ గర్ల్, 19/9/2026, దువా, దీపిక, రణ్‌వీర్' అని పేర్కొన్నారు. దిష్టి తగలకూడదనే అర్థం వచ్చేలా ఎమోజీని కూడా జతచేశారు. ఈ పోస్ట్ చూసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ పోస్ట్‌పై నటి కృతి సనన్ స్పందిస్తూ, "అభినందనలు! దువాకు తోడుగా చెల్లెలు వచ్చింది. ఇది నిజంగా దేవుడి ఆశీర్వాదం" అని వ్యాఖ్యానించారు. గాయని శ్రేయా ఘోషల్, నటి కృతి కర్బందా, డిజైనర్ మసాబా గుప్తాతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
బిడ్డ పుట్టడానికి ఒకరోజు ముందు, శుక్రవారం ఈ జంట ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి మొదటి కుమార్తె దువా జన్మించే ముందు కూడా వీరు ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం. రణ్‌వీర్, దీపిక దంపతులు 2018 నవంబర్‌లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న మొదటి కుమార్తె దువా జన్మించింది.