"ప్రతిసారి దేవుడే దిగిరావాలా?".. పవర్‌ఫుల్ గా సత్యదేవ్ 'సమవర్తి' టీజర్
- విడుదలైన సత్యదేవ్ ‘సమవర్తి’ అఫీషియల్ టీజర్
- మహదేవ్‌గా రా, రస్టిక్ లుక్‌లో ఆకట్టుకుంటున్న సత్యదేవ్
- గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగ్స్
- ఈసారి హిట్ గ్యారెంటీ అంటున్న చిత్రబృందం
- అజయ్ నాగ్ వి దర్శకత్వంలో రుద్ర పిక్చర్స్ నిర్మాణం
విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, మరో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సమవర్తి'. ఇటీవల విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అఫీషియల్ టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ఆద్యంతం గ్రిప్పింగ్‌గా సాగిన ఈ టీజర్, సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో యూనిట్ సభ్యులు టీజర్ ను ఆవిష్కరించారు.
టీజర్ ఆరంభంలో అడవి నేపథ్యంలోని సంభాషణలు, పులి-జింక ప్రస్తావనతో కథాంశంపై ఆసక్తిని రేకెత్తించారు. "ఆపద వచ్చిన ప్రతీసారి దేవుడే దిగిరావాలా?" అనే శక్తిమంతమైన ప్రశ్న తర్వాత, గిరిజనులను కాపాడే దైవ స్వరూపుడైన "మహదేవ్" పాత్రలో సత్యదేవ్ ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రా, రస్టిక్ అవతార్‌లో ఆయన కనిపించిన తీరు, గంభీరమైన వాయిస్ ఓవర్ ఆకట్టుకున్నాయి.
"నేను నొక్కాలి... తూటా తలలోకి వెళ్లాలి, అది నేను చూడాలి" వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియజేస్తున్నాయి. విజువల్స్ చాలా సహజంగా, కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేలా ఉన్నాయి. దీనికి తోడు, టీజర్ మూడ్‌కు తగ్గట్టుగా నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది.
అజయ్ నాగ్ వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై శివ చరణ్ రెడ్డి, పడమటి శశిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల "రావు బహదూర్" చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యదేవ్, ఈసారి మాస్, యాక్షన్ ప్రేక్షకులను అలరించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. "ఈసారి అస్సలు మిస్ అవ్వదు" అంటూ టీజర్ చివర్లో వచ్చే డైలాగ్, సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.