టికెట్ అడిగిన టీటీఈ.. బట్టలు చించుకుని యువతి హల్‌చల్.. వీడియో ఇదిగో!
- దానాపూర్-సికింద్రాబాద్ రైలులో టికెట్ లేకుండా ప్రయాణం
- టికెట్ చూపించమన్న టీటీఈతో యువతి వాగ్వాదం
- తన దుస్తులు తానే చించుకుని వేధింపుల ఆరోపణలు
- వీడియో ఆధారాలతో బట్టబయలైన యువతి నాటకం
- రూ.1000 జరిమానా విధించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ఓ యువతి చేసిన హంగామా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. టికెట్ చూపించమని కోరిన టీటీఈ పైనే సదరు యువతి వేధింపుల ఆరోపణలు చేస్తూ నానా రభస చేసింది. బీహార్‌లోని దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సదరు యువతిని టీటీఈ టిక్కెట్ అడగడంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. టీటీఈని బెదిరించడమే కాకుండా, తన దుస్తులను తానే చించుకుని, ఆయన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరుస్తూ హైడ్రామా సృష్టించింది.
అయితే, ఈ ఘటన మొత్తాన్ని తోటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడంతో ఆమె నాటకం బట్టబయలైంది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది అక్కడికి చేరుకుని, వీడియో ఆధారాలను పరిశీలించి యువతిదే తప్పని నిర్ధారించారు. అనంతరం ఆమెకు రూ.1,000 జరిమానా విధించి వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.