మంగళగిరిలో మహిళా క్రికెట్ జాతర.. డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన నారా బ్రహ్మణి
- డబ్ల్యూఏపీఎల్ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారా బ్రహ్మణి
- మంగళగిరిలో అట్టహాసంగా ప్రారంభమైన తొలి విమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్
- నాలుగు జట్లతో మంగళగిరి వేదికగా సెప్టెంబర్ 27 వరకు టోర్నీ
- మహిళా సాధికారతే లక్ష్యమన్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
- ఈ లీగ్‌కు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ మార్గదర్శకత్వం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలోని యువ క్రీడాకారిణుల ప్రతిభను వెలుగులోకి తెచ్చి, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ముఖ్య అతిథిగా విచ్చేసి, టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్‌తో కలిసి ఆమె ట్రోఫీని ఆవిష్కరించారు.
అంతకుముందు, స్టేడియం ప్రాంగణానికి చేరుకున్న నారా బ్రహ్మణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు ఘనస్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన బ్రహ్మణి, మిథాలీ రాజ్‌తో కలిసి డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడా స్ఫూర్తిని చాటారు.
ఈ సందర్భంగా నారా బ్రహ్మణి మాట్లాడుతూ, మహిళల కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఒక ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది రాష్ట్రంలోని యువ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక అని అభివర్ణించారు. సరైన అవకాశం లభిస్తే మహిళలు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టిస్తారని, ఈ లీగ్‌లో రాణించే క్రీడాకారిణులు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా (రోల్ మోడల్స్‌గా) నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి వేదికగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని నాని, కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఇతర నిర్వాహకులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువ మహిళా క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ, అవకాశాలు కల్పించడమే డబ్ల్యూఏపీఎల్ ప్రధాన లక్ష్యం. ఇక్కడ రాణించిన వారిని జాతీయ స్థాయిలో జరిగే ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL), భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యేలా ప్రోత్సహించాలన్నది ఏసీఏ సంకల్పం. ఈ లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తూ, భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె స్ఫూర్తితో యువ క్రీడాకారిణులు మరింత ఉత్సాహంగా రాణిస్తారని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రాంచైజీ పద్ధతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ టీ-20 టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్లు ఉన్నాయి. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా ఏడు రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగగా, సాయంత్రం ప్రారంభోత్సవం అనంతరం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ నిర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారా బ్రహ్మణిని నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు డి. విష్ణుతేజ, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వైఎస్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కూడా సందడి చేశారు.