నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన మమత!
- నందిగ్రామ్ బరి నుంచి తప్పుకున్న మమత వర్గం అభ్యర్థి
- కాంగ్రెస్ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించిన దీదీ
- ఇండియా కూటమి ఐక్యత కోసమే ఈ నిర్ణయమన్న మమత
- బీజేపీ ఒక జుమ్లా పార్టీ అని తీవ్ర విమర్శలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో, బీజేపీకి వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి ఐక్యతను చాటేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఉప ఎన్నికకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి సంచితా ప్రధాన్ అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామంతో తాము మరో అభ్యర్థిని బరిలోకి దించబోమని, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు పూర్తిస్థాయిలో మద్దతిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు.
ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ, "మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం. ఇండియా కూటమికి మా పూర్తి సంఘీభావం ఉంటుంది" అని పేర్కొన్నారు. అంతకుముందు రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేశారని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం మద్దతు తెలుపుతూ సందేశం పంపారని ఆమె వివరించారు. ఇదే క్రమంలో బీజేపీని ఒక 'జుమ్లా పార్టీ'గా ఆమె అభివర్ణించారు.
రాష్ట్ర సచివాలయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన తర్వాత సంచితా ప్రధాన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. కాగా టీఎంసీలోని రెండు వర్గాలకు ఎన్నికల సంఘం కొత్త గుర్తులను కేటాయించింది. మమత వర్గానికి 'ఫుట్‌బాల్ ప్లేయర్', ప్రత్యర్థి వర్గానికి 'ఎన్వలప్' గుర్తులను కేటాయించిన సంగతి తెలిసిందే.