"మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు".. శ్రుతి హాసన్ ఇలా అనేసిందేంటి?
- పురుషులకు కూడా పీరియడ్స్ రావాలని కోరుకున్న శ్రుతి హాసన్
- అప్పుడే నటీమణుల కాంట్రాక్టులలో 'పీరియడ్స్ సెలవులు' రాస్తారని వ్యాఖ్య
- తాను పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని, తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడతానని వెల్లడి
- కెరీర్ ఆరంభంలో నొప్పి గురించి సెట్‌లో చెప్పడానికి ఇబ్బంది పడ్డానని వ్యాఖ్య
- ఓ దర్శకుడితో విషయం చెప్పాక వాతావరణం మారిపోయిందని వెల్లడి
"మగవాళ్లకు కూడా నెలసరి (పీరియడ్స్) వస్తే ఎంత బాగుండు! కనీసం అప్పుడైనా మా కాంట్రాక్టులలో అధికారికంగా 'పీరియడ్స్ సెలవులు' అని రాసేవారేమో" అంటూ ప్రముఖ నటి శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మహిళలు ముఖ్యంగా సినీ రంగంలో పనిచేసే వారు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందుల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ఓ పాడ్‌కాస్ట్‌లో శ్రుతి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని, దీనివల్ల పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటానని ఆమె వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ సెట్‌లో ఈ నొప్పి గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయానని గుర్తుచేసుకున్నారు. ఒకవైపు ఈ అంశంపై మాట్లాడటం నిషిద్ధం అని భావించడం, మరోవైపు ఇబ్బందిగా ఉండటంతో మౌనంగా భరించేదాన్నని తెలిపారు. "కొన్ని రోజులు నేను చాలా నీరసంగా కనిపించేదాన్ని. నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయేవి. కానీ, దర్శకులు గానీ, ఇతరులు గానీ నాలో ఆ మార్పును గమనించినా అసలు కారణం వారికి తెలిసేది కాదు" అని శ్రుతి వివరించారు.
అయితే, ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని శ్రుతి తెలిపారు. తన సహనటుడికి మోకాలికి సర్జరీ అయినప్పుడు, షూటింగ్ సిబ్బంది మొత్తం అతనికి అనుకూలంగా ఏర్పాట్లు చేసి, చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పారు. అది చూశాక, తన ఆరోగ్య సమస్య గురించి కూడా ధైర్యంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
ఆ తర్వాత మొదటిసారి ఓ దర్శకుడికి తన ఆరోగ్య పరిస్థితిని వివరించానని, ఆయనకు కూడా కూతురు ఉండటంతో తన బాధను వెంటనే అర్థం చేసుకున్నారని శ్రుతి గుర్తుచేసుకున్నారు. "ఆయన సానుకూల స్పందనతో మా మధ్య సంభాషణ తీరే మారిపోయింది. సెట్‌లో వాతావరణం మరింత స్నేహపూర్వకంగా మారింది. ఆ తర్వాత నుంచి నా ఇబ్బందిని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
శ్రుతి వ్యాఖ్యలకు సోహా అలీ ఖాన్ కూడా మద్దతు తెలిపారు. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే, ఎవరు ఎక్కువ బ్లీడ్ అయ్యారు, ఎవరి ట్యాంపూన్ సైజు పెద్దది అనే విషయాల్లో వారు పోటీ పడేవారేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక శ్రుతి సినిమాల విషయానికొస్తే, గతేడాది రజినీకాంత్‌తో కలిసి నటించిన 'కూలీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.518 కోట్లు వసూలు చేసినా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇటీవల 'పెద్ది' చిత్రంలో ఓ పాటలో ఆమె కనిపించారు. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో 'ట్రైన్', దుల్కర్ సల్మాన్‌తో తెలుగులో 'ఆకాశంలో ఒక తార' చిత్రాల్లో నటిస్తున్నారు.