వైభవ్ కాదని శాంసన్‌కే ఎందుకు ఛాన్స్? అసలు కారణం చెప్పిన కోచ్ గంభీర్
- ఆఫ్ఘన్ సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన వైభవ్
- ప్రపంచకప్ గెలిచిన జట్టు కాంబినేషన్‌ను కొనసాగించాలనే శాంసన్‌కు అవకాశం
- సూర్యవంశీ ప్రతిభపై సందేహం లేదన్న గంభీర్
- ఇంగ్లాండ్ సిరీస్‌లో శాంసన్‌ను పక్కన పెట్టడం చాలా కఠిన నిర్ణయమన్న కోచ్
- శాంసన్ ఇప్పటికే జట్టు కోసం ఏం చేయగలడో నిరూపించుకున్నాడని వ్యాఖ్య
భారత్ టీ20 జట్టులో చోటు కోసం వైభవ్ సూర్యవంశీ మరికొంత కాలం ఎదురుచూడాల్సిందేనని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లోనూ 15 ఏళ్ల ఈ యువ సంచలనం బెంచ్‌కే పరిమితమయ్యాడు. సూర్యవంశీకి ప్రతిభ లేక కాదని.. ఇప్పటికే భారత్ తరఫున తన సత్తా నిరూపించిన సంజూ శాంసన్‌కే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ చెప్పాడు.
జింబాబ్వే పర్యటనలో సూర్యవంశీ అదరగొట్టాడు. సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 196.10గా ఉంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లోనూ అతడికి అవకాశం దక్కుతుందని అభిమానులు భావించారు. అయితే శాంసన్ జట్టులోకి తిరిగి రావడంతో సూర్యవంశీ తుది జట్టులో చోటు కోల్పోయాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ముగిసినా చివరి మ్యాచ్‌లోనూ సూర్యవంశీని ఆడించలేదు. దీనిపై అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీనికి గంభీర్ వివరణ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా శాంసన్ భారత్ తరఫున ఏం చేయగలడో నిరూపించుకున్నాడని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శనను గుర్తు చేశాడు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో శాంసన్‌ను పక్కన పెట్టి సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠిన నిర్ణయాల్లో ఒకటని గంభీర్ తెలిపాడు. అయితే ప్రపంచకప్ గెలిచిన జట్టు కాంబినేషన్‌ను తిరిగి కొనసాగించాలనే ఉద్దేశంతోనే శాంసన్‌కు అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల్లో శాంసన్ రెండు అర్ధసెంచరీలు చేశాడు. మొత్తం 117 పరుగులు సాధించాడు. దీంతో గంభీర్ నిర్ణయానికి మరింత బలం చేకూరింది.
సూర్యవంశీ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే కొన్నేళ్లుగా నిలకడగా రాణించిన ఆటగాడు కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడి కంటే ముందుండటం సహజమని అన్నాడు. సూర్యవంశీకి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చాడు.
“15 ఏళ్ల ఆటగాడైనా.. 30 ఏళ్ల ఆటగాడైనా అవకాశం కోసం ఎదురుచూడాల్సిందే” అని గంభీర్ వ్యాఖ్యానించాడు. దీంతో జపాన్‌తో టీ20 మ్యాచ్ లేదా ఆసియా క్రీడల్లో సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.