లోకేశ్ ప్రత్యేక చొరవ... ఏపీకి ఐటీ, క్వాంటం కంపెనీల క్యూ.. వేల ఉద్యోగాలకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
- ఐటీ మంత్రి నారా లోకేశ్ కృషితో ఏపీకి తరలివస్తున్న టెక్ కంపెనీలు
- రూ.526 కోట్ల పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
- విశాఖలో డెలాయిట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ భారీ ఆపరేషన్స్ సెంటర్ల ఏర్పాటు
- అమరావతి కేంద్రంగా క్వాంటం టెక్నాలజీ హబ్.. రూ.2,700 కోట్లతో సృష్టి క్వాంటం సంస్థ
- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,000 కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ, నిరంతర కృషితో రాష్ట్రానికి దిగ్గజ ఐటీ, ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీలు భారీ ఎత్తున తరలివస్తున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ భేటీలో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 8,896 ఉద్యోగాలు కల్పించే 10 కీలక ఐటీ ప్రాజెక్టులకు, అలాగే క్వాంటం టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించగల పలు ప్రాజెక్టులకు బోర్డు ఆమోదముద్ర వేసింది.
విశాఖకు ఐటీ కళ.. అమరావతిలో క్వాంటం విప్లవం
ఐటీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన చొరవతో విశాఖపట్నం మరోసారి ఐటీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. తాజాగా జరిగిన SIPB భేటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డెలాయిట్, విశాఖలో రూ.43.75 కోట్ల పెట్టుబడితో 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. అదేవిధంగా, ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ.100 కోట్ల పెట్టుబడితో వైజాగ్‌లో "ఇంటిగ్రేటెడ్ హబ్ ఏఐ & టెక్ ట్రైనింగ్ సెంటర్"ను నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా 2,400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మరోవైపు, రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఇందులో భాగంగా సృష్టి క్వాంటం ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల భారీ పెట్టుబడితో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్, నానోఫ్యాబ్రికేషన్ తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఒక్క ప్రాజెక్టుతోనే దాదాపు 3,000 ఉద్యోగాలు రానున్నాయి. వీటితో పాటు క్వాంటం కోడాన్, అరోహాక్ టెక్నాలజీస్, ట్రైక్వాంటా లాబ్స్, ఫోటాన్‌కోర్ సిస్టమ్స్, వెరిడేటా హెల్త్ వంటి సంస్థలు కూడా అమరావతిలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఈ కంపెనీల రాకతో క్వాంటం ఏఐ, డ్రగ్ డిస్కవరీ, ఫోటోనిక్స్ క్వాంటం రీసెర్చ్ వంటి అత్యాధునిక రంగాల్లో రాష్ట్ర యువతకు ఉజ్వల అవకాశాలు లభించనున్నాయి.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. కడప జిల్లాలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ రూ.70 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు ప్రోత్సాహకాల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తాజా నిర్ణయాలతో విశాఖపట్నం, అమరావతి, కడప వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. లోకేశ్ నాయకత్వంలో ఐటీ రంగంలో వస్తున్న ఈ మార్పులు, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.