‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. అదిరిపోయే లుక్‌ విడుదల!

‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. అదిరిపోయే లుక్‌ విడుదల!

Upendra in Zombie Reddy 2 stunning first look released
  • పుట్టినరోజున ఫస్ట్‌లుక్‌ విడుదల
  • వైల్డ్‌, ఫియర్స్‌ అవతార్‌లో ఉపేంద్ర
  • చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ లుక్‌
  • షానయా కపూర్‌ తెలుగు ఎంట్రీ
  • సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం
హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జాంబీ రెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. కన్నడ స్టార్‌ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ వర్గాలు తెలిపాయి. పోస్టర్‌లో అతడు ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో వైల్డ్‌, ఫియర్స్‌ లుక్‌లో కనిపించాడు. భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. చేతిలో పొడవాటి ఆయుధం పట్టుకున్న అతడి లుక్‌ ఆసక్తి రేపుతోంది.

రఫ్‌ లుక్‌, పొడవాటి జుట్టు, తీక్షణమైన చూపుతో ఉపేంద్ర పాత్రకు మిస్టరీ టచ్‌ ఇచ్చారు. డార్క్‌ కాస్ట్యూమ్‌, గిరిజన తరహా డిజైన్లు ఆ పాత్రను మరింత విభిన్నంగా చూపిస్తున్నాయి. దట్టమైన అడవి, మండుతున్న కాగడాలు, మిస్టరీగా కనిపించే ఆకారాలతో పోస్టర్‌కు ఫాంటసీ-యాక్షన్‌ వాతావరణం తీసుకొచ్చారు. ‘రెడీ టు టర్న్‌ ది వరల్డ్‌ అప్‌సైడ్‌ డౌన్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పోస్టర్‌కు మరింత హైప్‌ తీసుకొచ్చింది.

ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటి షానయా కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ‘జాంబీ రెడ్డి’ సృష్టికర్త ప్రశాంత్‌ వర్మ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా.. సుపర్ణ్‌ ఎస్‌. వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

‘జాంబీ రెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌ - డెడ్‌ ఆర్‌ అలైవ్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్‌ భాషల్లో విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
Advertisement
Upendra
Zombie Reddy 2 Next Level
Teja Sajja
Prasanth Varma
Upendra First Look
Shanaya Kapoor

More Telugu News