బ్లాగర్‌కు షాక్.. మద్యం తాగుతుంటే చెంప పగులగొట్టిన తండ్రి.. వైరల్ వీడియో ఇదిగో!

బ్లాగర్‌కు షాక్.. మద్యం తాగుతుంటే చెంప పగులగొట్టిన తండ్రి.. వైరల్ వీడియో ఇదిగో!

Blogger shocked as father slaps him while drinking alcohol
  • స్నేహితులతో మద్యం తాగుతున్న బ్లాగర్‌కు తండ్రి షాక్
  • కొడుకు అరుష్ భోలాను చెంపదెబ్బ కొట్టిన తండ్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన 35 సెకన్ల వీడియో
  • ఇది నిజమా లేక నటన మాత్రమేనా అని నెటిజన్ల చర్చ
సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో అంచనా వేయలేం. తాజాగా, ప్రముఖ ఇండియన్ బ్లాగర్ అరుష్ భోలాకు సంబంధించిన ఒక వీడియో అంతర్జాలంలో సంచలనంగా మారింది. తన నివాసంలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా, అకస్మాత్తుగా వచ్చిన అరుష్ తండ్రి అతని చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సుమారు 35 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో, అరుష్ భోలా తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతని తండ్రి అక్కడికి చేరుకున్నారు. తండ్రిని చూసిన అరుష్ నవ్వేందుకు ప్రయత్నించగా, ఆయన ఒక్కసారిగా కుమారుడి చెంపపై బలంగా కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న స్నేహితులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన వారిని కూడా వదల్లేదు. వారిపైనా చేయి చేసుకున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది వాస్తవమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం కేవలం వ్యూస్ కోసమే రూపొందించిన నాటకమని కామెంట్లు చేస్తున్నారు. కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషయాలను ఇలా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ, ఈ తండ్రీకొడుకుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Arush Bhola
Arush Bhola viral video
Blogger Arush Bhola slap video
Indian blogger drinking controversy
Arush Bhola father video

More Telugu News