వీధులపాలైన స్టార్ ప్లేయర్.. ఆదుకున్న యూనివర్సిటీ పూర్వ విద్యార్థి!
- టెక్సాస్‌లో 8 నెలలుగా నిరాశ్రయుడిగా మాజీ ఫుట్‌బాల్ స్టార్
- యూనివర్సిటీ బ్యాక్‌ప్యాక్‌తో గుర్తుపట్టిన పూర్వ విద్యార్థి
- ఆన్‌లైన్ ఫండ్‌రైజర్‌తో 17,000 డాలర్ల సేకరణ
- సొంత ఇంటితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సాంప్సన్ జేమ్స్
ఒకప్పుడు అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడలో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా రాణించిన సాంప్సన్ జేమ్స్, విధి వక్రించి గత ఎనిమిది నెలలుగా అమెరికాలోని టెక్సాస్ వీధుల్లో నిరాశ్రయుడిగా కాలం వెళ్లదీశాడు. అయితే, యాదృచ్ఛికంగా జరిగిన ఒకే పరిచయం అతని జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. ఒకప్పటి కీర్తికి ఆనవాలుగా అతని వద్ద మిగిలిన యూనివర్సిటీ బ్యాక్‌ప్యాక్, నేడు అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఇటీవల ఇండియానా యూనివర్సిటీ (ఐయూ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాస్పర్ స్టైన్‌మెట్జ్, ఆస్టిన్ నగర వీధుల్లో నడుస్తుండగా ఒక నిరాశ్రయుడి వద్ద ఎర్రటి 'ఐయూ' అథ్లెటిక్ బ్యాక్‌ప్యాక్‌ను గమనించాడు. తన పూర్వ విద్యాలయానికి చెందిన ఆ బ్యాక్‌ప్యాక్‌ను చూడగానే, జాస్పర్ ఆగి ఆ వ్యక్తితో మాట కలిపాడు. ఆ సంభాషణలోనే సదరు వ్యక్తి ఒకప్పటి ఫుట్‌బాల్ స్టార్ సాంప్సన్ జేమ్స్ అని తెలిసి అతను విస్తుపోయాడు.
అనంతరం ఆన్‌లైన్‌లో శోధించిన జాస్పర్‌కు జేమ్స్ నేపథ్యం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. 2019లో భారీ అంచనాలతో 'ఐయూ'లో చేరిన జేమ్స్, మోకాలికి తగిలిన తీవ్ర గాయం కారణంగా క్రీడా జీవితానికి దూరమయ్యాడు. ఆ తర్వాత బైపోలార్ డిజార్డర్ బారిన పడి, 2023లో డిగ్రీ పూర్తి చేయకుండానే యూనివర్సిటీని వీడాల్సి వచ్చింది. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో చివరకు ఆస్టిన్ వీధుల్లో నిరాశ్రయుడిగా మిగిలిపోయాడు.
జేమ్స్ దీనావస్థను చూసి చలించిన జాస్పర్, అతని కోసం ఆన్‌లైన్ ద్వారా నిధుల సేకరణ (ఫండ్‌రైజర్) ప్రారంభించాడు. దీనికి విశేష స్పందన లభించడంతో సుమారు 17,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 14 లక్షలు) జమ అయ్యాయి. ఆ నిధులతో జేమ్స్ కోసం ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని, కొన్ని నెలల అద్దెను ముందుగానే చెల్లించడమే కాకుండా, నిత్యావసరాలను కూడా సమకూర్చాడు. ప్రస్తుతం సాంప్సన్ జేమ్స్ తనకు లభించిన ఈ సహకారంతో నూతన జీవితాన్ని నిర్మించుకుంటున్నాడు. తనను ఆదుకున్న వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.