దక్షిణాఫ్రికా పర్యటన.. మహాత్మాగాంధీ మునిమనవడితో అయ్యన్నపాత్రుడు భేటీ

దక్షిణాఫ్రికా పర్యటన.. మహాత్మాగాంధీ మునిమనవడితో అయ్యన్నపాత్రుడు భేటీ

Ayyanna Patrudu meets Mahatma Gandhis great grandson in South Africa
  • దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అయ్యన్నపాత్రుడు
  • డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్ సందర్శన
  • గాంధీ మునిమనవడిని సత్కరించిన అయ్యన్న

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు డర్బన్ సమీపంలోని చారిత్రాత్మక 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్'ను సందర్శించారు. మహత్మాగాంధీ సత్యాగ్రహ పోరాటానికి పునాది వేసిన ఈ పవిత్ర భూమిని సందర్శించడం తనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, పవిత్ర యాత్ర లాంటి అనుభవాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అక్కడి 'సర్వోదయ హౌస్'లో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ పర్యటనలో గాంధీజీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రామ్ గోబిన్‌ను ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు ప్రతిరూపమైన కలంకారీ శాలువాతో సత్కరించి, అనకాపల్లి జిల్లా ప్రత్యేకత అయిన ఏటికొప్పాక హస్తకళాకృతిని జ్ఞాపికగా బహూకరించారు. ఆ ప్రాంతంలో విలువల ఆధారిత విద్యను అందిస్తున్న కస్తూర్బా పాఠశాల యాజమాన్యాన్ని, తరతరాలుగా గాంధేయవాదాన్ని ప్రచారం చేస్తున్న గాంధీ కుటుంబ సభ్యుల కృషిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా కొనియాడారు.

Advertisement
Chintakayala Ayyanna Patrudu
Mahatma Gandhi Great Grandson
Phoenix Settlement South Africa
AP Assembly Speaker
Kidar Ramgobin
Etikoppaka Toys

More Telugu News