బ్రిక్స్ ఫొటో: మోదీ, పుతిన్‌ల మధ్యలో ఉన్న ఆ యువ ఐఎఫ్ఎస్ అధికారి ఎవరు?
- ఆయన పేరు సిద్ధార్థ్ బాబు, 2017 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి
- ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దౌత్య వ్యాఖ్యాతగా బాధ్యతలు
- సివిల్స్‌లో 15వ ర్యాంక్ సాధించినా, దౌత్య రంగంపై ఆసక్తితో ఐఎఫ్ఎస్ ఎంపిక
- అగ్రనేతల మధ్య చర్చలు సజావుగా సాగేలా చూడటమే ఆయన విధి
న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమ్మిట్‌లో ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వంటి అగ్రనేతల మధ్య ఓ యువకుడు నిలబడి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ఎవరు? అంతటి ప్రపంచ నేతల మధ్య ఆయనకేం పని? అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.
ఆ యువకుడే సిద్ధార్థ్ బాబు. 2017 బ్యాచ్‌కు చెందిన భారత విదేశీ సేవల (ఐఎఫ్ఎస్) అధికారి అయిన ఆయన, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దౌత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో యూరప్, యురేషియా వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అగ్రనేతల మధ్య జరిగే అత్యంత కీలకమైన, సున్నితమైన సమావేశాల్లో భాషాపరమైన అడ్డంకులను తొలగించి, చర్చలు సజావుగా సాగేందుకు సహాయపడటం ఆయన విధి.
బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ పాల్గొన్న కీలక సమావేశాల్లో సిద్ధార్థ్ ఆయన వెన్నంటే ఉన్నారు. ముఖ్యంగా పుతిన్, మోదీల మధ్య తీసిన ఫోటోలో ఆయన నిలబడి ఉండటంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
సివిల్స్‌లో 15వ ర్యాంకర్
సిద్ధార్థ్ బాబుది కేరళలోని కొచ్చి. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన, సివిల్ సర్వీసెస్‌లోకి రాకముందు ప్రైవేట్ రంగంలో, ముఖ్యంగా ఈ-కామర్స్ సెక్టార్‌లో పనిచేశారు. చిన్నప్పటి నుంచి అంతర్జాతీయ వ్యవహారాలపై ఉన్న ఆసక్తితో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. 2016లో యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్‌కు అర్హత ఉన్నప్పటికీ, దౌత్య రంగంపై ఉన్న మక్కువతో ఐఎఫ్ఎస్‌ను ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీకి వ్యాఖ్యాతగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు.