రేసింగ్ ట్రాక్‌పై విజయ్, అజిత్.. స్నేహబంధంతో అభిమానులకు సర్‌ప్రైజ్!

రేసింగ్ ట్రాక్‌పై విజయ్, అజిత్.. స్నేహబంధంతో అభిమానులకు సర్‌ప్రైజ్!

Vijay and Ajith on racing track surprise fans with friendship
  • బ్రిటన్‌లోని రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, హీరో అజిత్ భేటీ
  • విజయ్‌కు ఆయన పార్టీ రంగులతో కూడిన రేసింగ్ సూట్ బహూకరణ
  • విజయ్‌తో కలిసి రేసింగ్ కారులో ట్రాక్‌పై చక్కర్లు కొట్టిన అజిత్
  • ఇద్దరు అగ్ర హీరోల స్నేహబంధంపై సోషల్ మీడియాలో హర్షం
తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న విజయ్, అజిత్ కుమార్ మధ్య అరుదైన కలయిక చోటుచేసుకుంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో వీరిద్దరూ కలుసుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌కు, నటుడు అజిత్ కుమార్ ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

నిన్న‌ రేసింగ్ అనంతరం విజయ్‌ను కలిసిన అజిత్, ఆయన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) రంగులను పోలిన రేసింగ్ సూట్‌ను బహూకరించారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప‌ట్ల‌ విజయ్ ఆనందం వ్య‌క్తం చేశారు. కేవలం బహుమతితోనే సరిపెట్టకుండా రేసింగ్ పట్ల మక్కువ ఉన్న అజిత్.. స్వయంగా కారు నడుపుతూ విజయ్‌తో కలిసి ట్రాక్‌పై నాలుగు ల్యాప్‌లు చక్కర్లు కొట్టారు.

బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఏళ్లుగా పోటీదారులుగా ఉన్న ఈ ఇద్దరు స్టార్లు, నిజ జీవితంలో ఇంత స్నేహపూర్వకంగా కనిపించడం ఇరువర్గాల అభిమానులను కదిలించింది. పోటీని పక్కనపెట్టి వారు చూపిన ఆప్యాయతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరుదైన కలయికకు సంబంధించిన వార్తలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.
Advertisement
Vijay
Ajith Kumar
Silverstone Racing Circuit
Tamilaga Vettri Kazhagam
Vijay Ajith meeting UK
TVK racing suit

More Telugu News