టెక్ ప్రపంచంలో సంచలనం.. ఏఐ వేగానికి కళ్లెం వేయాలంటున్న మస్క్, ఆల్ట్‌మన్
- ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న ఆంథ్రోపిక్ సీఈఓ
- ఈ వాదనకు మద్దతు తెలిపిన ఆల్ట్‌మన్, ఎలాన్ మస్క్
- నియంత్రణకు మించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ సామర్థ్యాలపై ఆందోళనలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, భద్రతాపరమైన ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమొడెయ్ కీలక పిలుపునిచ్చారు. అనూహ్యంగా ఆయన వాదనకు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఎక్స్ఏఐ (xAI) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాలు బహిరంగంగా మద్దతు తెలపడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
డేరియో అమొడెయ్ ఈ అంశంపై తన బ్లాగ్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. "మనం ఏఐ మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని తప్పనిసరిగా తగ్గించాలి. ఇలా చేయడం వల్ల లభించే సమయాన్ని వివేకంతో సద్వినియోగం చేసుకోవాలి. ఏఐతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం దాని అభివృద్ధి వేగం.. దానికి సంబంధించిన ప్రమాదాలను అంచనా వేసి, నియంత్రించే మన సామర్థ్యాన్ని మించిపోయింది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా స్వీయ-అభివృద్ధి చెందే వ్యవస్థలు, స్వయంప్రతిపత్త ఏజెంట్ల వల్ల ఎదురయ్యే ముప్పును ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో తమ కంపెనీ భద్రతా పద్ధతులను ధ్రువీకరించుకోవడానికి స్వతంత్ర థర్డ్-పార్టీ నిపుణులకు 'ఉద్యోగుల తరహా యాక్సెస్' కల్పిస్తామని అమొడెయ్ సంచలన ప్రకటన చేశారు.
అంటే.. కంపెనీ అంతర్గత వ్యవహారాలను కూడా వారు పరిశీలించేందుకు వీలుంటుంది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి పారదర్శక చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ మొత్తం కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
అమొడెయ్ ప్రతిపాదనపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వెంటనే స్పందించారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. "ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాలన్న డేరియో వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. గత కొన్ని వారాలుగా ఓపెన్‌ఏఐలో మేము ఇదే అంశంపై చర్చిస్తున్నాం. స్వతంత్ర నిపుణులకు ఉద్యోగుల తరహా యాక్సెస్ ఇవ్వాలనే ఆలోచన అద్భుతమైనది. మేం కూడా అదే పని చేస్తాం. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.
మరోవైపు, టెక్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న ఎలాన్ మస్క్ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఆయన క్లుప్తంగా, సూటిగా "డేరియో చెప్పింది నిజం" అని పోస్ట్ చేశారు. ఏఐ భద్రతపై పరిశోధకులు, నిపుణుల మధ్య జరుగుతున్న చర్చలకు ఈ పరిణామం మరింత బలాన్నిచ్చింది. అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం బహిరంగ ప్రకటనలకే పరిమితమైంది. పరిశ్రమ స్థాయిలో దీన్ని అమలు చేయడానికి ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి లేదా కఠినమైన ఒప్పందం ఇంకా కుదరలేదు.