గల్వాన్ తర్వాత తొలిసారి.. మోదీ-జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధం?
- సెప్టెంబర్ 12, 13న ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు
- మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీకి అవకాశం
- 2020 గల్వాన్ తర్వాత ఇదే తొలి ముఖాముఖి చర్చ
- అజిత్ దోవల్ ఇటీవల చైనాలో చర్చలు
- సరిహద్దు, వాణిజ్యం, భద్రతపై చర్చకు అవకాశం
ఐదేళ్లుగా దూరంగా ఉన్న భారత్-చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశముంది. అదే జరిగితే 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే తొలిసారి అవుతుంది.
జిన్‌పింగ్ శనివారం భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఇటీవల కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించి కరచాలనం చేసుకున్నారు. అయితే అప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇప్పుడు బ్రిక్స్ వేదికగా భేటీ జరిగితే ఇరుదేశాల సంబంధాలపై దాని ప్రభావం కీలకంగా ఉండొచ్చు.
సరిహద్దు నుంచి వాణిజ్యం వరకు..
జిన్‌పింగ్ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. సరిహద్దు వ్యవహారాలపై డబ్ల్యూఎంసీసీ సమావేశం తర్వాత ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల చర్చలు కూడా జరిగాయి. తాజా భేటీలో సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్.. మరో కీలక అంశం
లడఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గినా సరిహద్దు వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న వాదనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా చెబుతుండగా.. భారత్ దాన్ని పూర్తిగా తిరస్కరిస్తోంది. ఇటీవల అప్పర్ సుబన్‌సిరి ప్రాంతంలో చైనా సైనిక కదలికలపై వచ్చిన నివేదికలు కూడా ఆందోళన పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ-జిన్‌పింగ్ భేటీ జరిగితే సరిహద్దులో శాంతి, స్థిరత్వంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అమెరికా సుంకాలు, పశ్చిమాసియాలో అస్థిరత నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదీ చర్చకు రావచ్చు.