అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు! దక్షిణాఫ్రికా బ్యాటర్ అద్భుత శతకం

అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు! దక్షిణాఫ్రికా బ్యాటర్ అద్భుత శతకం

Jordan Hermann World record on debut South African batter wonderful century
  • తొలి వన్డేలోనే 150 పరుగులు చేసిన జోర్డాన్ హెర్మన్
  • అరంగేట్రంలో అత్యధిక స్కోరు ప్రపంచ రికార్డు సమం
  • గతేడాది దక్షిణాఫ్రికాకే చెందిన బ్రీట్జ్కే రికార్డు సరసన
  • నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం
  • హెర్మన్ మెరుపులతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు
దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (24) తన అరంగేట్ర వన్డేలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నమీబియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన హెర్మన్, ఏకంగా 150 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

తమ దేశానికే చెందిన మాథ్యూ బ్రిట్జ్కే రికార్జును సమం చేశాడు. బ్రీట్జ్కే గత ఏడాది ముక్కోణపు సిరీస్‌లో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 148 బంతుల్లో 150 పరుకులు చేయడం ద్వారా వన్డే ఆరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు జోర్డాన్ దీనిని సమం చేశాడు.

తాజా మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హెర్మన్, అరంగేట్ర మ్యాచ్ అనే ఒత్తిడి ఏమాత్రం లేకుండా దూకుడుగా ఆడాడు. కేవలం 126 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టోనీ డి జోర్జి (72)తో కలిసి రెండో వికెట్‌కు 190 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలుత 61 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న హెర్మన్, ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 93 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.

గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై-సిరీస్‌లో దక్షిణాఫ్రికాకే చెందిన మరో ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన అరంగేట్ర వన్డేలో 150 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు హెర్మన్ కూడా అదే స్కోరు సాధించి తన దేశీయ ఆటగాడి రికార్డు సరసన నిలవడం విశేషం.
Advertisement
Jordan Hermann
South Africa vs Namibia
ODI Debut World Record
Highest Score on ODI Debut
Matthew Breetzke

More Telugu News