80ల ట్రెండ్‌లో సీఎం రేవంత్.. యమహా బైక్‌తో డాషింగ్ లుక్!

80ల ట్రెండ్‌లో సీఎం రేవంత్.. యమహా బైక్‌తో డాషింగ్ లుక్!

Revanth Reddy in 80s trend dashing look with Yamaha bike
  • సోషల్ మీడియా 80s ట్రెండ్‌లో చేరిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఏఐ సాయంతో 80ల నాటి లుక్‌లో తన ఫొటో షేర్
  • యమహా ఆర్ఎక్స్‌ 100 బైక్, పాత రేడియోతో ఆకట్టుకుంటున్న ఫొటో
  • సీఎం డాషింగ్ లుక్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం
సోషల్‌ మీడియాలో ప్రస్తుతం నడుస్తున్న '80s' ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా చేరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో తనను తాను 80ల నాటి యువకుడిగా ఊహించుకుంటూ రూపొందించిన ఓ ఫొటోను ఆయన తన 'ఎక్స్‌' ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోలో రేవంత్‌ రెడ్డి డాషింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అప్పటి యువతకు ఐకానిక్‌గా నిలిచిన యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ పక్కన స్టైలిష్‌గా నిల్చుని ఉన్నారు. ఫొటోలో పాతకాలపు వాతావరణం కనిపించేలా పక్కనే ఒక వింటేజ్ రేడియోను కూడా ఉంచారు. హెయిర్‌స్టైల్‌, దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ 80ల నాటి కాలాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి.

"తాను కూడా 80s ట్రెండ్‌లో జాయిన్‌ అయ్యానని" రేవంత్ రెడ్డి ఈ ఫొటోకు క్యాప్షన్ జోడించారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు, అభిమానులు దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ‘అన్నా.. సూపర్‌’, ‘టాలీవుడ్‌ ఓ మంచి హీరోను మిస్‌ అయింది’, ‘డాషింగ్‌ లుక్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ఏఐ సాయంతో ఇలాంటి ఫొటోలను సృష్టించి పంచుకుంటున్నారు. కేవలం యువతకే పరిమితం అనుకున్న ఈ ట్రెండ్‌లో ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా భాగం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Advertisement
Revanth Reddy
Telangana CM
Yamaha RX 100
AI 80s Trend
Revanth Reddy Viral Photo
Social Media Trends

More Telugu News