జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ దాడి.. పలు యుద్ధ విమానాల ధ్వంసం
- జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు
- దాడిలో పలు యూఎస్ యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని రిపోర్ట్
- ఇరాన్ దాడులను ప్యాట్రియాట్ క్షిపణులతో తిప్పికొట్టిన అమెరికా దళాలు
- ఎన్నికల తర్వాత యుద్ధం ముగియవచ్చన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో పలు అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం.
ఈ దాడిలో ఒక ఏ-10 థండర్‌బోల్ట్ యుద్ధ విమానం ఎడమ రెక్క పూర్తిగా ధ్వంసమైందని, మరో ఎనిమిది ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు పాక్షికంగా దెబ్బతిన్నాయని సీబీఎస్ రిపోర్టర్ జెన్నిఫర్ జాకబ్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో జోర్డాన్‌లోని అమెరికా దళాలు 30కి పైగా ప్యాట్రియాట్ క్షిపణులను ప్రయోగించాయి.
ఇటీవల అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోగా, అందుకు ప్రతీకారంగా అమెరికా ఐదు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే తాజా దాడి చోటుచేసుకుంది. తాము ఎనిమిది అమెరికా ఆయిల్ ట్యాంకర్లు, రెండు యుద్ధ నౌకలతో పాటు జోర్డాన్‌లోని మువఫఖ్ సల్తీ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల తర్వాత ఇరాన్‌తో వివాదం సద్దుమణగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించే సామర్థ్యం ఇరాన్‌కు లేదని, కేవలం అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికే ఆ దేశం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని బుధవారం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు.