ఏపీకి మరో కీలక రైల్వే ప్రాజెక్టు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు
- రేణిగుంట-అరక్కోణం మధ్య 3, 4వ రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఏపీలో కనెక్టివిటీకి ఇది మరో పెద్ద ఊతమన్న సీఎం చంద్రబాబు
- ఈ ప్రాజెక్టు కోసం రూ.1,157 కోట్లు కేటాయించినట్లు వెల్లడి
- తిరుపతి, రాయలసీమకు ప్రయోజనం కలుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్
- ప్రధాని మోదీ, రైల్వే మంత్రికి ఇరువురు నేతల కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేణిగుంట-అరక్కోణం సెక్షన్‌లో మూడవ, నాలుగవ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఎన్డీయే డబుల్ ఇంజిన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీకి మరో పెద్ద ఊతం లభించింది. రేణిగుంట-అరక్కోణం సెక్షన్‌లో 3వ, 4వ లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పరిధిలోని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 46 కిలోమీటర్ల మేర రూ.1,157 కోట్ల వ్యయంతో పనులు జరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కొత్త లైన్ల నిర్మాణంతో రైళ్ల రద్దీ తగ్గడమే కాకుండా, రైళ్ల రాకపోకల్లో సమయపాలన మెరుగుపడుతుందని చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా తిరుపతికి వెళ్లే యాత్రికులు, ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, సరుకు రవాణా కూడా వేగవంతమవుతుందని ఆయన అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్రం నిరంతరం మద్దతు ఇస్తోందని కొనియాడారు. "దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల విలువైన ఐదు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులతో భారతీయ రైల్వే నెట్‌వర్క్ రూపురేఖలు మారనున్నాయి. దీనిద్వారా దాదాపు 540 కిలోమీటర్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది" అని ఆయన తెలిపారు.
అరక్కోణం-రేణిగుంట 3, 4వ లైన్ల నిర్మాణం వల్ల తిరుపతికి, రాయలసీమ ప్రాంతానికి కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనివల్ల రద్దీ తగ్గి పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 17 జిల్లాలు, 2,121 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ప్రతి కొత్త ట్రాక్ ప్రజలను అవకాశాలతో, వ్యాపారాలను మార్కెట్లతో అనుసంధానం చేస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.