టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్.. జట్టులోకి ఇద్దరు ఆల్‌రౌండర్లు

టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్.. జట్టులోకి ఇద్దరు ఆల్‌రౌండర్లు

Double good news for Team India as two all rounders return to the squad
  • గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి
  • ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకున్న ఆల్‌రౌండర్లు
  • గురువారం ఢిల్లీలో జట్టుతో కలవనున్న ఇద్దరు ఆటగాళ్లు
  • దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత జట్టులో చేరనున్న ఇషాన్, తిలక్ వర్మ
ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. స్టార్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో వీరిద్దరూ ఉత్తీర్ణులయ్యారు. వీరు గురువారం ఢిల్లీలో జట్టుతో కలవనున్నారు.

గత జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా సుందర్ తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక జూన్‌లో స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్వాడ్రిసెప్స్ గాయానికి గురయ్యాడు. తాజాగా వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

ఈనెల 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టుతో భారత్ ఆడనున్న తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరోవైపు, మోకాలి గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా లభ్యతపై ఇంకా స్పష్టత రాలేదు. హర్షిత్ రాణా కూడా ఇంకా కోలుకోకపోవడంతో, వీరి స్థానంలో స్థానిక పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ జట్టుతో చేరుతారు. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఈనెల 22న జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడి, ఆ తర్వాత ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.
Advertisement
Team India
Washington Sundar
Nitish Kumar Reddy
India vs Afghanistan T20
BCCI Fitness Test
Shreyas Iyer

More Telugu News