సౌదీలో నదులు లేవు.. వర్షం కురవదు.. అయినా 3.7 కోట్ల మందికి నీళ్లు ఎలా?
- సౌదీ అరేబియాలో నీటికి డీసాలినేషన్ ప్లాంట్లే కీలక ఆధారం
- సముద్రపు నీటిని శుద్ధి చేసి ఎడారి ప్రాంతాలకు తరలిస్తున్న వైనం
- వందల కిలోమీటర్లు విస్తరించిన పైపుల నెట్‌వర్క్
- రివర్స్ ఆస్మోసిస్‌తో ఉప్పు, మలినాల తొలగింపు
- శుద్ధి తర్వాత కాల్షియం, మెగ్నీషియం కలిపే ప్రక్రియ
ఎటు చూసినా మండే ఇసుక. వర్షం పడేది ఏడాదిలో కొన్నిరోజులే. నదులు అసలే లేవు. అయినా 3.7 కోట్ల మందికి తాగునీరు అందుతోంది. సముద్రాన్ని మంచినీటిగా మార్చి, వందల కిలోమీటర్ల దూరం ఎడారిలోకి తరలిస్తూ సౌదీ అరేబియా అద్భుత జల వ్యవస్థను నిర్మించింది.
సముద్రం నుంచి ఎడారిలోకి
సౌదీ అరేబియాలో 95 శాతానికి పైగా భూభాగం పొడి ఎడారి ప్రాంతమే. చాలా చోట్ల వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లకు కూడా చేరదు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. అయినా దేశంలో 3.7 కోట్ల మందికి నీటి సరఫరా ఆగదు. దీనికి ప్రధాన ఆధారం సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు.
తీర ప్రాంతాల్లోని డీసాలినేషన్ ప్లాంట్ల నుంచి శుద్ధి చేసిన నీటిని భారీ పైపుల ద్వారా దేశం లోపలికి పంపిస్తారు. ఈ పైపుల నెట్‌వర్క్ వందల కిలోమీటర్లు విస్తరించింది. ఎడారి మధ్యలో ఒక కృత్రిమ నదిలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.
భారీ పైపుల నిర్మాణం
ఈ పైపులు సాధారణమైనవి కావు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్‌తో తయారు చేస్తారు. కొన్ని పైపుల పొడవు 12 నుంచి 18 మీటర్ల వరకు ఉంటుంది. దీంతో మార్గంలో జాయింట్లు తగ్గుతాయి. అల్ట్రాసోనిక్ పరీక్షల తర్వాత తుప్పు పట్టకుండా ప్రత్యేక పూత వేస్తారు.
ఎడారిలో పైపుల ఏర్పాటు మరో పెద్ద సవాలు. జీపీఎస్, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని ముందుగా గుర్తిస్తారు. ఇసుక దిబ్బలు, బలహీనమైన నేల ప్రాంతాలను తప్పిస్తారు. కొండలు, రాళ్లు అడ్డొస్తే నియంత్రిత పేలుళ్లతో గుంతలు తవ్వి పైపులను అమరుస్తారు.
సముద్రపు నీటి శుద్ధి
డీసాలినేషన్ ప్లాంట్లలో సముద్రపు నీటిని ముందుగా ఇసుక ఫిల్టర్లతో శుభ్రం చేస్తారు. తర్వాత 1-5 మైక్రాన్ల పరిమాణంలోని కణాలను పట్టుకునే ఫిల్టర్లలోకి పంపిస్తారు. ప్రధాన దశలో రివర్స్ ఆస్మోసిస్ ద్వారా నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగిస్తారు.
దీని కోసం దాదాపు 60 బార్ల ఒత్తిడితో నీటిని మెంబ్రేన్ల గుండా పంపిస్తారు. అనంతరం కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలుపుతారు. పీహెచ్‌ను సైతం సర్దుబాటు చేస్తారు.
భారీ ఖర్చు.. తప్పని అవసరం
ఈ వ్యవస్థ నిర్మాణానికి భారీగా పెట్టుబడి అవసరం. కిలోమీటరు పైప్‌లైన్ నిర్మాణానికే లక్షల డాలర్లు ఖర్చవుతాయి. పెద్ద డీసాలినేషన్ ప్లాంట్లకు వందల మిలియన్ డాలర్లు అవసరం. ఒక క్యుసెక్ నీటిని తయారు చేసేందుకు సాంకేతికత, ఇంధన ధరలు, ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి డాలర్లలో ఖర్చవుతుంది.
అయినా సౌదీకి ఇది తప్పనిసరి. సహజ మంచినీటి వనరులు చాలా పరిమితంగా ఉండటంతో సముద్రపు నీటిని తాగునీటిగా మార్చడం దేశ జీవనాధారంగా మారింది.