అభిషేక్ బెనర్జీకి హైకోర్టు హెచ్చరిక.. పార్టీ ఆఫీసు కూల్చివేతపై స్టే ఎత్తివేస్తాం!

అభిషేక్ బెనర్జీకి హైకోర్టు హెచ్చరిక.. పార్టీ ఆఫీసు కూల్చివేతపై స్టే ఎత్తివేస్తాం!

Abhishek Banerjee warned by High Court over party office demolition stay
  • పదేపదే వాయిదాలు కోరడంపై ధర్మాసనం అసంతృప్తి
  • సెప్టెంబర్ 22న వాదనలకు సిద్ధం కాకపోతే స్టే పొడిగించబోమన్న కోర్టు
  • అక్రమ కట్టడమంటూ వచ్చిన ఫిర్యాదుతో అధికార యంత్రాంగం కూల్చివేత చర్యలు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా, అమ్తలాలో ఉన్న ఆయన పార్టీ కార్యాలయ కూల్చివేతపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తామని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు అభిషేక్ తరఫు న్యాయవాది పదేపదే గడువు కోరడంపై జస్టిస్ సువ్రా ఘోష్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం మంగళవారం అసహనం వ్యక్తం చేసింది.

ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఆ రోజున కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా లేకపోతే, కూల్చివేతపై ఇచ్చిన మధ్యంతర స్టేను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

అమ్తలాలోని టీఎంసీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ సుశాంత్ మండల్ అనే వ్యక్తి మే 17న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర యంత్రాంగం, జూలై 18, 19 తేదీల్లో ఆ కార్యాలయ కూల్చివేత పనులను చేపట్టింది.

అయితే, తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా చర్యలు చేపట్టారని టీఎంసీ వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో కూల్చివేతపై మధ్యంతర స్టే విధించింది. ఈ ఆస్తి అభిషేక్ బెనర్జీ కుటుంబానికి చెందిన 'లీప్స్ అండ్ బౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరు మీద నమోదై ఉంది. సంబంధిత నోటీసులు కూడా పరిపాలన విభాగం ఈ సంస్థకే జారీ చేసింది.
Advertisement
Abhishek Banerjee
Calcutta High Court
Trinamool Congress
Leaps Bounds Private Limited
West Bengal
Amtala office demolition

More Telugu News