ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి ఊరట.. రూ.10 వేల డిపాజిట్ వెనక్కి
- లాటరీలో ఇళ్లు రాని వారికి డిపాజిట్ల వాపసు
- ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి నేరుగా ఖాతాల్లోకి జమ
- మీ-సేవలో నగదు ఇచ్చిన వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- నగదు చెల్లింపుదారులు దరఖాస్తుకు సెప్టెంబరు 10వ తేదీ ఆఖరు
- 4 నియోజకవర్గాల్లో కొత్త దరఖాస్తులకు కూడా 10వ తేదీనే తుది గడువు
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంపై హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లాటరీలో ఇళ్లు దక్కించుకోని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ధరావతు (ఈఎండీ) మొత్తాన్ని బుధవారం నుంచి తిరిగి చెల్లించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. ఈ వాపసు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి హౌసింగ్ బోర్డు రూ.10 వేలను ఈఎండీగా స్వీకరించింది. ఆన్‌లైన్ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించిన వారు డబ్బుల వాపసు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని గౌతమ్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించారో, తిరిగి అదే ఖాతాకు జమ చేస్తామని వివరించారు. అయితే, కొందరు మీ-సేవ కేంద్రాల్లో నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించామని, వారు మాత్రం డబ్బు వాపసు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
నగదు రూపంలో చెల్లించిన వారు హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ `tghb.telangana.gov.in` ద్వారా ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఇది పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని ఆయన పేర్కొన్నారు. పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040-24603572 నంబరుకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
మరోవైపు, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని గౌతమ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.