భాగ్యనగరానికి ప్రమాద ఘంటికలు.. విపత్తులను తట్టుకోలేని నగరాల్లో ప్రపంచంలోనే రెండో స్థానం!
- అగ్రస్థానంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం
- ఆల్ఫాజియో సంస్థ అధ్యయనంలో వెల్లడి
- మౌలిక వసతుల లోపమే ఈ దుస్థితికి కారణమని నివేదిక స్పష్టీకరణ
- సురక్షిత నగరాల జాబితాలో అమెరికాలోని షికాగో నగరం ప్రథమ స్థానం
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి ఓ అంతర్జాతీయ నివేదిక తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అత్యధిక వేడి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే తట్టుకోలేని అత్యంత బలహీనమైన మౌలిక వసతులున్న నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రమాదకర జాబితాలో మొదటి స్థానంలో కూడా మన దేశంలోని నగరమే ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఎదుర్కొంటున్న ముప్పులు, వాటి సన్నద్ధతపై ‘ఆల్ఫాజియో’ అనే సంస్థ నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. చారిత్రక వైభవంతో దేశంలోనే తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌కు భారీ వరదల ముప్పు పొంచి ఉందని, వాటిని ఎదుర్కొనే వ్యవస్థలు నగరంలో దాదాపుగా లేవని ఈ నివేదిక హెచ్చరించింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలను తట్టుకునే శక్తి మౌలిక వసతులకు లేదని స్పష్టం చేసింది.
ఈ నివేదిక ప్రకారం, ప్రమాదపుటంచున ఉన్న మొదటి పది నగరాల్లో తొమ్మిది ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నగరాలే అధికంగా ఉండటం ఈ ప్రాంతంలోని భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత పాకిస్థాన్‌లోని ముల్తాన్, బంగ్లాదేశ్‌లోని ఢాకా, పాకిస్థాన్‌లోని లాహోర్, భారత్‌లోని కోల్‌కతా, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్, కరాచీ, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరాలు వరుసగా ఉన్నాయి.
సురక్షిత నగరాలు ఏం చేస్తున్నాయి?
ఒకవైపు ప్రమాద ఘంటికలు మోగుతుంటే, మరోవైపు కొన్ని నగరాలు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా అమెరికాలోని షికాగో నిలిచింది. ఆ తర్వాత అడిస్ అబాబా (ఇథియోపియా), మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), బార్సిలోనా (స్పెయిన్), ప్యారిస్ (ఫ్రాన్స్) వంటి నగరాలు ఉన్నాయి.
"సురక్షిత నగరం అంటే అక్కడ విపత్తులే రావని అర్థం కాదు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆ నగరాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి" అని ఆల్ఫాజియో సంస్థ వ్యవస్థాపకుడు పరాగ్ ఖన్నా వివరించారు. ప్రమాదంలో ఉన్న నగరాలు తమ మౌలిక వసతులను బలోపేతం చేసుకోవడం ద్వారా సురక్షితంగా మారవచ్చని ఆయన సూచించారు. ఉదాహరణకు, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పవర్ గ్రిడ్లను పటిష్టం చేయడం, వరద ముప్పును తప్పించుకునేందుకు షికాగో తరహాలో భారీ భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థలను నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.