పోలీసు ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులు స్వీకరించండి: తెలంగాణ హైకోర్టు
- ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశం
- దరఖాస్తుల్లో 'ఇతరులు' అనే కాలమ్ లేకపోవడంపై ఆగ్రహం
- భౌతికంగానైనా అప్లికేషన్లు తీసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డుకు సూచన
- ట్రాన్స్‌జెండర్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి
- హోంశాఖ, డీజీపీకి వివరణ కోరుతూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు ఫారంలో స్త్రీ, పురుష లింగాలతో పాటు 'ఇతరులు' అనే కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని ప్రభుత్వాన్ని, రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లలో తమకు అవకాశం కల్పించలేదని సూర్యాపేట జిల్లాకు చెందిన డి.తనుశ్రీ, మరికొందరు ట్రాన్స్‌జెండర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదిస్తూ, అన్ని రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాలని గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
వాదనలు విన్న ధర్మాసనం, సమాజంలో కేవలం రెండు లింగాలే ఉంటాయన్న మూస ధోరణి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. గతంలో హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు ఎందుకు రూపొందించలేదని నిలదీసింది. దరఖాస్తుల గడువు ఈనెల 16 వరకు ఉందని బోర్డు తరఫు న్యాయవాది తెలపడంతో, ఆన్‌లైన్ పోర్టల్‌లో అవకాశం లేకపోతే భౌతికంగానైనా సరే ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు తీసుకుని, వారికి రశీదు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హోంశాఖ, డీజీపీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.